మరుగున పడ్డ మన సంస్కృతి – మార్గోన్లు

0
2

[box type=’note’ fontsize=’16’] “ఒకప్పుడు పోలాల అమావాస్య రోజుల్లో మొగపిల్లలు మార్గోన్ల ఆటలు ఆడేవారనీ, ఆ మార్గోన్ల ఎత్తులు రకరకాలుగా ఉండేవని, సంస్కృతిలో భాగమైన ఆ ఆటలిప్పుడు మరుగున పడ్డాయని వివరిస్తున్నారు నల్ల భూమయ్య ఈ వ్యాసంలో. [/box]

[dropcap]అ[/dropcap]ప్పట్ల పోలాల అమావాస్య రోజులల్ల మొగపిల్లగాండ్లు మార్గోన్ల ఆటలు ఆడెటోళ్ళు. ఆ మార్గోన్ల ఎత్తులు భూమికి జానెడు ఎత్తు నుంచి మొదలు కొంటే పందిర్లంత ఎత్తుదనుక. ఇగ మామూలుగానైతే వాటి ఎత్తు మోకాళ్ళ దనుక నుంచి నిలువెడంత ఎత్తుల వుండేటియి. మామూలు పొరగాండ్ల మామూలు ‘గలివర్’ అంత ఎత్తుల కట్టుకుంటే మాత్కారపు పొరగాండ్లు మట్టుకు సూరత్తన పోళ్ళు, సుతారి తనపోళ్ళు గవీటి ఎత్తులను అయితే ‘లిల్లీపుట్’లకు సరిపడేటంత ఎత్తుల, కాకుంటే ‘జెయింట్’లకు సరిపడేటంత ఎత్తుల తయారు జేసేటోళ్ళు. ఒకడు ‘వాలఖిల్యుల’కు  తగ్గట్టుగ భూమికి జానెడు ఎత్తుల కట్టితే, యింకొకడు ‘మహాకాయిని’కి సరిపడేటంత ఎత్తుల తయారుజేసుడు. గీ మార్గోన్లు జేసుట్ల ‘లచ్చులు’, ‘వెంకటేశం’, ‘లచ్చుమన్’లు అందిరకంటే సూతారపోళ్ళు. మహా యికమతులోళ్ళు. పని తోడవులే వేరు బంగారమొక్కటే అన్నట్లో గవే కంకబొంగులు, గవే సులిలితాళ్ళు – గని గవీటెతోటి జేసే మర్లోన్ల ఎత్తులే వేరు. లోక బుద్ధి విడిచి లోజూపు జూడరా అన్నట్టుగ వాళ్ళ పని ఒనరులు అందరివారం వుండేటియిగాదు. ‘అందరధికులైన హారునకు తావేది’ అన్నట్టుగ అందరికన్న వేరేగా హెచ్చరికాలు జేసేటోళ్ళు. మార్లోన్ల నెక్కి అయితే భూమికి జానెడు ఎత్తుల, కాకుంటే పందిర్లంత ఎత్తుల యిండ్ల కప్పులను జూసుకుంట నడ్సెటోళ్ళు. ఇండ్ల నుంచి బయట తెల్లుడు కాళ్ళమీద గాదు, మార్గోన్ల మీదనే.

వాడ వాడలు, బజార్లు తిరుగుడు మార్గోన్ల మీదనే. ఇండ్లంత ఎత్తుల రెండు మార్గోన్ల మీద నడ్సుడే గాదు, గవిటి తోటి సర్కసు జేసుడు. ఒక మార్గోన్ని తీసి భుజం మీద పెట్టుకొని ఒక్క మార్గోని మీదనే కుంటుకుంట నడ్సుడు. వట్టిద కుంటుకుంట నడ్సుడేగాదు, ఎదురుగ మార్గోని మీద ఎవడన్న వస్తే, వాడు వీడు మార్గోన్లతోటి కొట్లాడుడు. మార్గోని మార్గోని తోటికొట్టుకనుడు. మార్గోన్ల తోటి కోట్లాడేటప్పుడు మట్టుకు కింద పడ్డాగాడా కాళ్ళు చేతులు విరుగకుంట వుండటానికి మోకాళ్ళ ఎత్తు, నడుంల ఎత్తు మార్గోన్లతోటే కొట్లాడుడు. సాము జేసి జెట్టి సాహిసియైయుండు అన్నట్టుగ మార్గోన్ల తోటి పోటీ పుడుడు. సాముజేయకున్న సరసపడడు. అన్నట్టుగ గట్ల కొట్లాడకుంటే వాళ్ళకు నిదుర వచ్చేటిదిగాదు. ఎంత వారినైన ఎత్తున పడగీట్టు అన్నంతటి తురుంఖాన్లు. కాచకుమ్మరికి గాదు, కమ్మరికే తగును అన్నట్టుగ ఎత్తుల నడ్సుకుంట, యింట్ల కప్పులను జూసుకుంట పోయ్యేటోళ్ళు ఘటోత్కచుని వారం, ‘గట్టయ్య’ వారం.

చదువరి మతి కన్న సాధకు మతి హెచ్చు అన్నట్టుగ ‘లచ్చులు’ ‘వెంకటేశం’ ‘లచ్చుమన్’లు మార్గోన్ల మీద రుచిరముగను జూడ అచలమై దోచురా అన్నట్టుగ వాళ్ళు యిండ్ల కప్పులనే కిందికి జూసుకుంట తిరిగెటోళ్ళు. దృక్కు దృశ్యంబులను మించి తెలియునట్లు అందరికి యిండ్ల చూరులే కన్పిస్తే వీళ్ళకు మట్టుకు యిండ్ల కప్పులు కన్పిస్తుంటై. బంటుతనము రాదు ప్రతిభలేమి అని సుతారితనాన్ని జూపిచ్చుకుంట బంటులం అన్పిచ్చుకునేటోళ్ళు.

అంత ఎత్తు మార్గోన్ల మీద ఎక్కి, నాలుగు జంగలల్ల బజారు తిరిగెటోళ్ళు. ఒక్క జంగల ఎన్నో బారెలదూరం.

మార్గోన్లను ఎన్నో రోజులు ముందుగనే తయారు జేసుకుని ఎన్నో రోజులు వాటి తోటి ఆటలాడి, ఆఖరు రోజున పోలాల అమావాస్య నాడు, మబ్బులనే నిద్రలేచి, మార్గోన్ల తోటి ఆడినోళ్ళందరు జమై వూరవుతలవున్న చెరువుకు పోయి, మార్గోన్లని చెరువుల వేసెటోళ్ళు. ఆడవాళ్ళుగద బతుకమ్మలని సాగనంపినట్లు – వీళ్ళు  మార్గోన్లని సాగనంపి వచ్చెటోళ్ళు. తిరిగి వస్తూ వస్తూ చిట్టడవి వంటి జంగల్నుంచి ఈగలు దోమలు యిండ్లళ్ళకు రాకుంట వుండుటానికి ఆ చెట్లకోమ్మల్ని విరుచుకొని వచ్చి యింటింటికి తిరిగి యిండ్ల చూరులల్ల చెక్కెటోళ్ళు – ఈగలు దోమలు జంజారే మార్గోన్ అని పాటల వారం కేకలు పెట్టుకుంట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here