Site icon Sanchika

మరుపన్నది లేక!!

[dropcap]మ[/dropcap]బ్బుల్లాగా క్రమ్ముకొన్న ఆలోచనలు..
ఎన్నో ఎన్నెన్నో కలలు!
ఆ కలలన్నీ ఎక్కడెక్కడో
తిరిగి తిరిగి అలసి సొలసి
చివరకు చేరాయి నీ ఒడిని..
నాకు చిన్నతనం గుర్తు లేదు
నా నవ్వులు అంతకన్నా గుర్తు లేవు
నేను గుక్కపెట్టి ఏడుస్తున్న
చప్పుడు నాకు వినిపించలేదు
ఒక్క నా గుండె చప్పుడు తప్ప!
ఆ గుండెలో రూపం లేని నీ నవ్వు తప్ప!
నీ తోటి బంధం అనుబంధంగా
తోటి స్నేహితురాళ్లతో
ఆటలు లేవు.. నీ ఊహ తప్ప!
మల్లెతీగలా నీ ముళ్ల మనస్సుకి
అల్లుకు పోయా, తెగలేని
మనస్సు బంధంలా..
నీకు దిష్టి తగులునేమోనని
నా ముఖానికి నల్లటి ముసుగేసా!
నా కళ్ళు నీ కోసం వెతికే క్షణం క్షణం
ఆశ ఆశ మనిషి విజయానికి
వాని పతనానికి పునాది అదే!
నీ మీదే నా దురాశ..
నన్ను ఏనాడు అది నీ దరికి చేరవేస్తుందో?
నీవు నన్ను తోసిరాజని నడచిపోయిన
రోజున దిక్కులు పిక్కటిల్లేలా
అరిచా, నా నోటికి బంధంగా
నీ ప్రేమను ఉంచి నీవు
మల్లెతీగ తెగదని నీ మరపనే
ముళ్ళ కొమ్మనే తెగ నరికావా ప్రియా!
ఆ ఎర్రటి గాయం నన్ను
ఇంకా మండిస్తూనే ఉంది..
కాటికి చాచిన ముసలాడు
ఖంగు ఖంగుమని దగ్గుతూ
పడి లేస్తున్న.. కెరటంలా దిగులు
చెందితే తన వాళ్ళని వదలలేక..
నేను దిగులు చెందితే
మరుపన్నది లేక!!

Exit mobile version