[dropcap]”అ[/dropcap]నా… నా… నాలా ఆశ సచ్చిపోవాలంటే ఏమి చేయాలనా?”
“పొద్దిన్న మసులకే లేసి యీదిలా నిలుసుకొని చెంబులా మంచు
నింపుకొని మొకము కడుకోరా”
“మంచుని చెంబులా నింపుకొని మొకము కడుకోవాలనా? ఇది
అయ్యేపనేనా? వేరే ఏమైనా చెప్పునా?”
“సరేరా! మట్టమద్యానము ఎండిండే చెరువులా నిలుసుకొని
చేతులు, కాళ్లు కడుక్కోరా”
“నీకేమైనా మతి పోయిందానా, ఇదీ అయ్యేపనేనా?”
“రేయ్ నీలా ఆశ చావాలంటే ఇట్ల పనులు చేయాల్సిందేరా”
“ఊహునా, ఇట్ల పనులు చేసేకి నా చేతిలా అయ్యెల్దునా”
“అట్లయితే నీలా ఆశ చచ్చెల్దు పోరా”
***
మసలకే = వేకువ జాముకే