[dropcap]”మ[/dropcap]నిషి గతం గొప్పనా? మతం గతం గొప్పనా?” అంటా గోపన్నని అడిగితిని.
“మనిషి గతమేరా” అనే అన్న.
“ఎట్లనా?”
“మనిషి నింకా మతము వచ్చె… మతము నింకా మనిషి రాలే. ఇట్లరా” అనె.
“అదెట్లా?” తిరగ అంట్ని.
“రేయ్! మతము నింకా మనిషి వచ్చింటే ఈ పొద్దు బూలోకములా ఇన్నిన్ని మతాలు వుండేవి కాదురా”
“ఓ… అవును కదా! అట్లయిత మనిషిది ఘనమైన గతము కదనా?”
“ఊరా! ఇట్లా గతాన్ని మరిచి మనిషి మతము పంచల చేరి మూడుడై పోయరా”
“గతాన్ని మరిచినోడు గద్దెక్కుతాడానా?”
“లేదురా గుంతలా పడిపోతాడు”
“అయ్యో! మనిషి నీ మతి ఏడపోయ, నీ గతి ఎల్లిట్లాయ?”
***
మతము పంచల = మతం నీడన