Site icon Sanchika

జపనీస్ కవి మేట్సువో బాషో ఆరు హైకూలు

[జపనీస్ కవి మేట్సువో బాషో రచించిన ఆరు హైకులను అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Matsuo Basho’s 6 Haikus by Mrs. Geetanjali.]

~

[dropcap]ని[/dropcap]ద్ర లేపిన అర్ధరాత్రి..
గడ్డ కట్టిన నూనెతో మసక బారిన దీపపు కాంతి.
★★★
ధారగా కురిసిన వర్షపు నీళ్లు చేను మడిలో
కోసిన వరి ధాన్యం పరకలను నల్లగా మార్చేసాయి
★★★
ఆవుల కొట్టం మీద కురిసిన చలి కాలపు వాన..
కోడిపుంజు మరణాన్ని కూసింది
★★★
తడిసిపోయిన లేత నీరుల్లి ఆకులు.. అప్పుడే కడిగినట్లు తెల్లగా
ఎంత చలిగా ఉండొచ్చొ కదా!
★★★
సముద్రపు బాతులు చేసే
మందకొడి శబ్దాల మధ్య.. సముద్రం చీకటైపోయింది.
★★★
శుష్కించిన ఎడారి మీదుగా వెర్రిగా తిరుగాడే నా కలలు.. అయినా సరే
నా ప్రయాణం.. కొనసాగుతుంది.

~

మూలం: మేట్సువో బాషో

అనువాదం: గీతాంజలి


ప్రముఖ జపనీస్ కవి మేట్సువో బాషోను హైకూలకు ఆద్యుడిగా పరిగణిస్తారు. ఈడో యుగపు అత్యంత ప్రముఖ కవిగా గుర్తింపు పొందిన బాషో కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాతి తన కవితలకు ప్రేరణ కోసం  దేశమంతా తిరిగారు. Minashiguri, Sarashina Kikō, Sumidawara వంటి రచనలు చేశారు.

Exit mobile version