మౌనంతో పొట్లి..

0
2

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘మౌనంతో పొట్లి..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]బొ[/dropcap]ట్టు మాట
రాలని ఎడారిలో
ప్రవాహమయ్యాను..

తేమ చెమ్మే లేని సాలులో
కళ్ళు కురిసి కురిసి
కెరటమయ్యాను..

పలుకు మొలవని
ఎండిన ముఖంలో
సందడి మడుగయ్యాను.

చిత్తడై పదునెక్కిన మనసు
మౌనంతో పొట్లి
నెర్రనలయ్యాను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here