మే 2020 సంపాదకీయం

2
3

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, అభిమానులకు, తెలుగు సాహిత్య ప్రేమికులకు ధన్యవాదాలు. రోజు రోజుకూ సంచికకు పెరుగుతున్న పాఠకాదరణ అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. పాఠకులను ఇంకా అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు సరికొత్త శీర్షికలను రచనలను అందించాలని తపనపడుతోంది సంచిక.

ఇది గడ్డుకాలం. అనూహ్యమైన రీతిలో కనబడని ఒక సూక్ష్మజీవి ప్రపంచాన్ని స్థంభింపచేస్తోంది. సామాజిక జీవితాలను, ఆర్థికవ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇల్లు దాటి బయట అడుగుపెట్టాలంటే భయం. సాటి మనిషిని కలవాలంటే భయం. ఇలా అడుగడుగునా భయంతో మనిషి జీవితం గడపాల్సివస్తోంది. కరోనా భయం ఎప్పుడు సమసిపోతుందో అని ఎదురుచూడాల్సివస్తోంది. ఈ సమయంలో ఒకరికొకరి ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అడుగు ముందుకు వేయాల్సివుంటుంది. సాటి మనిషికి నేనున్నానని ధైర్యం చెప్తూ, నాకు నీవున్నావు, నీకు నేనున్నాను, మనమంతా ఒకరికొకరము వున్నాము అంటూ ఒకటిగా నిలబడాలి సమాజం.

కానీ, మన భారతీయ సమాజంలో ఇదే సమయంలో వైరుధ్యాలు, విద్వేషాలు, దెబ్బ తీసుకోవటాలు, ఎత్తుకు పై ఎత్తులు, వాదాలు, వివాదాలు, ధిక్కారాలు, హేళనలు, ఆధిక్య భావనలు, రాజకీయాలు.. ఒకటేమిటి… మనమంటే మనకే అసహ్యం అనిపించే రీతిలో మన సమాజం ప్రవర్తిస్తోంది. తన మంచి కోరే వారిపైనే దాడులు చేస్తూ, తానున్న కొమ్మనే నరుక్కునే మన మూర్ఖత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శితోంది మన సమాజం. ఈ సమయంలో రచయితలు తమ రచనలతో సమాజంలో ఆరోగ్యకరమయిన ఆలోచనలను ప్రవహింపచేయాలి. భవిష్యత్తుపై ఆశను రేకెత్తించే రచనలతో ఉత్తేజితం చేయాలి. సమస్య పట్ల అవగాహన కలిగించాలి. ధైర్యాన్నివ్వాలి. సంచిక అందుకే కరోనా పై వ్యాసాలను, కవితలను, కథలను విస్తృతంగా ప్రచురిస్తోంది. అలాంటివి రాయమని రచయితలను ప్రోత్సహిస్తోంది.

వీలయినంత అధిక సంఖ్యలో తెలుగు పాఠకులను సాహిత్య పఠనం వైపు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు:

వ్యాసాలు:

  • సమాజం రూపాంతరం చెందుతున్న ఆ రోజుల్లో… – కోవెల సుప్రసన్నాచార్య
  • వినత కద్రువలు – అంబడిపూడి శ్యామసుందర రావు
  • అమ్మ కడుపు చల్లగా-2 – ఆర్. లక్ష్మి

కాలమ్స్:

  • రంగుల హేల-26- కరుణించి మమ్మొదిలిపో.. కరోనా! – అల్లూరి గౌరిలక్ష్మి

కథలు:

  • విన్నపాలు వినవలె – పి.వి. బుద్ధ
  • రాయలవారి తెలుగు – డా. టి. భవాని
  • రెక్కలొచ్చిన పక్షులు – గొర్రెపాటి శ్రీను
  • మలి కలయిక – తోట సాంబశివరావు
  • రూపాంతరం – శశికళ ఓలేటి

కవితలు:

  • వెళ్ళిపోయావు కదరా! – శ్రీధర్ చౌడారపు
  • మూసెయ్ తలుపులు! – డా. విజయ్ కోగంటి
  • భూగోళానికి తాళం – డా. సి.హెచ్. భవానీదేవి
  • కరోనా కర్తవ్యం – డా. కె.ఎల్.వి. ప్రసాద్
  • ఓర్పు సన్నగిల్లితే – ఆర్. లక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • పద ప్రహేళిక 5: దినవహి సత్యవతి

పుస్తకాలు:

  • ‘నేనిలా… తానలా…’ పుస్తక సమీక్ష – బొల్లోజు బాబా

బాలసంచిక:

  • శతధన్వుడు – సుజాత పి.వి.ఎల్.

త్వరలో పాఠకులను ఆకట్టుకునే మరిన్ని సరికొత్త రచనలు సంచికలో ప్రచురితమవుతాయి.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here