[dropcap]“నే[/dropcap]ను విశ్వసుందరిని, శ్రీదేవి అట్లా సౌందర్యము నాది తెలుసునా?” అంటా
ఆయమ్మ ఎగరలాడి దుమకలాడే
“అవునామా” అన్నింది తడువు.
“ఊ.. ఊహు.. హు” మెలికలు తిరిగి మేడమీదికి ఎక్కి నిలుసుకొనె.
“శానా మేగవద్దుమా… అట్లా సౌందర్యము సచ్చి సున్నమయింది.
ఈ కండ్లల (కన్నుల్లా) చూసిండాను” ములాజు లేకుండా అంట్ని. అంతే.
“ఆ ….? ? ?”
“నేను అట్లా ఇట్లా వాడు కాదు అలెర్జండర్ అట్లవాడు” మందిని చూస్తా మై
మరచే వాడు.
“ఓ నీది శానా పెద్ద సమాచారము కదరా” అనుమానముగా అంట్ని.
“ఈ … ఇహిహి…. ఇంగేమనుకొంటివి?” నగతా ఎదవ వేషాలు ఏసే వాడు.
“అట్లావాడే నిగురుకొనె, కడగా ఏమి తీసుకుపోలే ఇంగ
నువ్వేంత అని అనుకొంట్నిరా” అని చెప్పితిని చెప్పలా కొట్టినట్ల.
“ఆ …. ??”
………….
“నేను శానా శానా పెరిగిండాను (ఎదిగిండాను) నన్ని ఎవరు ఏమీ
చేసేకి అయ్యెలే … అని అంద్రు తెలసుకొండా” ఆంబోతులా అరిచేవాడు.
“ఏంరా? తెలుసుకొనేది ఆకాశము అంత పెరిగిన మాన్లు
ఒగే కిత యిరిగి నేలకి పడిండేది నేను శానాశానా కితాలు చూసిండాను
పోరాపో” అంటా కేకరిచ్చి ఉమిస్తిని.
“ఆ…?”
***
మేగవద్దు = విర్రవీగవద్దు.