Site icon Sanchika

‘మేకల బండ’ నవల ఆవిష్కరణ – ప్రెస్ నోట్

[dropcap]తి[/dropcap]రుపతి రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచించిన ‘మేకల బండ’ పుస్తకాన్ని 18 ఫిబ్రవరి 2024 సాయంత్రం తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో శ్వేత డైరెక్టర్ భూమన్, ఆవిష్కరించారు. ఎస్వీ యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆర్. రాజేశ్వరమ్మ పుస్తక సమీక్ష చేశారు.

మనిషిలాగే మూగజీవాలకు ఆలోచనాశక్తి వస్తే అవి కూడా  సంకుచిత జాడ్యాలకు గురి అవుతాయని రచయిత ఈ నవలలో తెలియజేశారు. వ్యంగ్య రూపంలో ప్రస్తుత సమాజ తీరు తెన్నులను  వివిధ పాత్రల ద్వారా చురకలు అంటిస్తారు. మూగజీవాలకు కూడా స్పందించే గుణం ఉందని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉందని హెచ్చరిస్తారు.

సహజ వాతావరణాన్ని మనిషి కలుషితం చేయడం వల్ల జీవాలకు సైతం కృత్రిమ గర్భధారణ పద్ధతుల అవసరం వస్తోందని రచయిత ఆవేదన వ్యక్తం చేస్తారు.

పాత చిత్తూరు జిల్లా ప్రాంతీయ పరిమళాలు వెదజల్లే నవల మేకల బండ అని వక్తలు కొనియాడారు.

మూగజీవాల నేపథ్యంతో రాసిన ఈ నవల తాత్విక చింతనతో కూడుకున్నదిగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ యునివెర్సిటీ ప్రొఫెసర్ ఆర్ వి సురేష్ కుమార్  మాట్లాడుతూ సజీవమైన భాష సహజ శైలి, ఉందని పుత్తూరు ప్రాంత స్వరం పలుకుతుందని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్, మల్లారపు నాగార్జున, కందారపు మురళి, ఎన్.బి.సుదాకర్ రెడ్డి, పేరూరు బాల సుబ్రహ్మణ్యం, టెంకాయల దామోదరం, ఏ.కృష్ణమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version