Site icon Sanchika

మేనల్లుడు-16

[అమృతతో అమెరికా వచ్చిన వివేక్, అమ్మూని ఇంట్లో ఉంచి మిత్రులను కలవడానికి వస్తాడు. కళ్ళతో గుంటలతో ఉన్న వివేక్‍ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటిలా అయిపోయావని, మావయ్య ఎలా ఉన్నారని అడుగుతారు. ఫోన్ కూడా చేయకుండా వచ్చేశావే అని రాధిక అడిగితే, తాను వస్తున్నటు దివ్యకి ఫోన్‍లో చెప్పానని, ఇండియాలో జరిగినదంతా చెప్పానని అంటాడు వివేక్. మాటల్లో దివ్య వాళ్ళకి ఏమీ చెప్పలేదని వివేక్‍కి తెలుస్తుంది. అమ్మూ వివేక్‍తో అమెరికా రావడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగితే వివేక్ చెబుతాడు. మిత్రులంతా బాధపడతారు. దివ్య ఫోన్ స్విచ్ ఆఫ్‍లో ఉందని, ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. తన పిన్ని దగ్గరకి వెళ్ళినట్టు తెలిసిందని రాధిక అంటుంది. సరేనని డీన్‍ని కలిసి వస్తానని వివేక్ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. వివేక్, అమృతల గురించి మిత్రులు తర్జన భర్జన పడతారు. ఇంటికి చేరిన వివేక్ అమ్మూని నిద్రలేపి భోజనం చేద్దామంటాడు. తండ్రిని తలచుకుని బాధపడ్తుంది అమ్మూ. వివేక్ ధైర్యం చెబుతాడు. తిని నిద్రపోయిన అమ్మూకి పీడకల వస్తుంది. ఇండియాలో తన తండ్రికి సీరియస్‍గా ఉన్నట్లు కల వస్తుంది. వివేక్ కూడా నిద్ర లేస్తాడు. ఇండియాకి ఫోన్ చేసి మావయ్యతో మాట్లాడుతాడు. అమ్మూ కూడా నాన్నతో మాట్లాడి ఊరట పొందుతుంది. – ఇక చదవండి.]

[dropcap]“ఏం[/dropcap] పాపం మామూ ఒక్కడే పని చేయాలా? మార్నింగ్ యూనివర్శిటికి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తాడు.. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి?.. చెప్పు నాన్నా? ..” అంది అమృత.

కంగారుగా అన్నాడు నారాయణరావు “అది కాదమ్మా.. నీకు వంటలు సరిగా రావు కదా? ఎలా చేస్తున్నావో? ఏమో అని.. అమ్మని పంపుదామని” అన్నాడు కూతురు కోపం పోగొడదామని..

“నాన్నా!.. రాత్రి సాంబారు, చికెన్ ఫ్రై చేసాను.. రెండు సార్లు రైస్, మూడు సార్లు చికెన్ ఫ్రై వేసుకొని మామూ బాగా లాగించేసాడు.. కావాలంటే మామూని అడగండి” అంది అమృత.

గభాలున పొలమారిన వివేక్ “అన్యాయం అమ్మూ!.. చాలా అన్యాయం!.. నేను ఎన్ని సార్లు రైస్ వేసుకున్నానో, ఎన్ని సార్లు చికెన్ వేసుకున్నానో కౌంట్ చేస్తున్నావా?” అన్నాడు..

కంగారుగా అంది అమృత.

“అది కాదు మామూ!.. నాకన్నా నువ్వంటేనే మా నాన్నకి ఇష్టం.. ఎందుకంటే.. వివేక్ బాబుకి సాంబారు, చికెన్ ఫ్రై ఇష్టం.. చేసారా అని అడుగుతారు కదా?.. అందుకు మీ మేనల్లుడికి ఇష్టమైన సాంబారు, చికెన్ ఫ్రై చేసాను.. కడుపు నిండా తిన్నాడని చెప్పాను.. అంతే..”

అందరూ పగలబడి నవ్వడం వీడియోలో చూసి.. వివేక్, అమృత మొహమొహాలు చూసుకున్నారు..

“సరే!.. మావయ్యా!.. ఫోను పెట్టేయనా” అన్నాడు వివేక్..

“సరే బాబూ..” అన్నాడు నారాయణరావు.

“మామూ!.. కాఫీ.. పెడుతున్నాను.. ఫ్రెషప్ అయ్యి రా” అని నాలుగు అడుగులు వేసి, గభాలున వెనక్కి తిరిగి

“థాంక్స్ మామూ!..” అంది.

“దేనికి అమ్మూ!..”

“రాత్రి భయంకరమైన కల వచ్చింది.. ఆ కలలో.. నాన్న.. నాన్న.. ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు.. కంగారుగా లేచి కూర్చున్నాను.. ఎంత సరిపెట్టుకున్నా మనసు కుదట పడలేదు.. బలవంతంగా పడుకున్నాను.. కాని నిద్ర పట్టలేదు.. అందుకే.. నీ దగ్గరకు వచ్చాను.. విచిత్రం!.. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది” అని వంట గదిలోకి నడిచింది..

అలా ఎంతో సేపు ఉడిపోయాడు.

“మామూ! త్వరగా రా.. ” అనడంతో గబగబా వాష్ రూమ్ వైపు అడుగులు వేసాడు వివేక్.

***

“ఏవండీ!.. విన్నారా?.. మీ అమ్మాయి ఇక్కడ వంట గదిలోకి వచ్చేది కాదు.. అక్కడ వివేక్ బాబుకి ఇష్టమైన సాంబారు చేసి, చికెన్ ఫ్రై చేసింది..” అంది సంతోషంగా సుమిత్ర..

“అందుకే కాబోలు వదిన మొన్న అమృత ఫోనులో ఇష్టమైన వంటలు ఏమిటని సాంబారు, చికెన్ ఫ్రై ఎలా అని అడిగింది.. youtube లో చూశాను కాని మీరు చేసినట్లు లేదు అంది..” చెప్పింది శారద..

“అదే ఆడపిల్ల గొప్పతనం!.. మెడలో తాళి పడక ముందు ఒకలా ఉంటారు. తరువాత మరోలా మరిపోతారు” అంది సుమిత్ర..

“నా కూతురు.. పెళ్ళికి ముందే భర్తని ఎంత బాగా చూసుకుంటుందో చూశారా?.. బంగారం నా కూతురు..” అన్నాడు సంతోషంగా నారాయణరావు.

“అబ్బో మీ కూతురు ఒక్కతే బంగారం కాదు.. నా మేనల్లుడు సాటి ఎవరు కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే డైమండ్” అంది సుమిత్ర..

“వదినా!.. డైమండ్ అయినా ధరించాలంటే బంగారం ఉండవలసిందే.. బంగారంలో డైమండ్‌ని పొదిగితేనే.. ఆ వస్తువు చూడడానికి రెండు కళ్ళు చాలవు” అంది శారద.

“ఎంత కరక్ట్‌ గా చెప్పావమ్మా శారద..” అన్నాడు సంతోషంగా నారాయణరావు

***

“మామూ!.. నన్ను ఒక ప్లేస్‌కి తీసుకువెళతావా?” అంది అమృత..

“ష్యూర్!.. అమ్మూ!.. ఎక్కడికికో చెప్పు? రెడీ అయిపోనా?” అని సోఫాలోంచి లేచి నిలబడ్డాడు.

“ఆగు.. ఆగు.. నా ఫ్రెండ్.. చిన్ననాటి ఫ్రెండ్ సౌమ్య.. పెళ్ళయి రెండు సంవత్సరాల నుండి USA లోనే ఉంది.. అప్పడప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం.. తను ప్రెగ్నెంట్ అని సంతోషంగా చెప్పింది. మొన్నటి దాక.. టచ్ లోనే ఉన్నాం.. కాని నాన్నకి హెల్త్ బాగోలేనప్పుటి నుండి నేను ఫోను చేయలేదు. కాని ఇక్కడకు వచ్చాక.. ఫోను చేశాను.. ఎత్తడం లేదు.. మనం వెళ్ళినా వాళ్ళు ఉన్నారో లేదో?” అంది..

“అమ్మూ!.. మనం వెళితే పోలా?.. వాళ్లు ఉంటే happy. లేకపోతే అలా తిరిగి ఇంటికి వచ్చేద్దాం.. సరేనా? ..” అన్నాడు వివేక్.

“అలా అయితే ఓకే మామూ, రెడీ అయిపోతాను. అన్నట్టు వాళ్ళింటికి ఏమైనా తీసుకువెళ్ళాలి కదా? ఈ పాటికి డెలివరీ అయిపోయి ఉంటుంది. Baby boy or baby girl ఎవరు పుట్టారో తెలియదు.. ఏం కొనాలి?” అంది..

“చిన్నప్పుడు పాప అయినా బాబు అయినా.. ఏ డ్రస్ వేసినా బాగుంటుంది.. పోనీ ఒక పని చేద్దాం డ్రస్‍తో పాటు ఇంకేమైన గిఫ్ట్ కొందాం.. సరేనా..” అన్నాడు.

“సరే!.. ” అని గబగబా గదిలోకి వెళ్ళి రెడీ అయి వచ్చింది అమృత.

అమృత వచ్చేలోగా.. ఎంక్వయిరీకి రెండు డాలర్లు కట్టి ఫోను నెంబరు ఇచ్చి, ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకున్నాడు..

“అన్నట్లు మామూ!.. అడ్రస్ ఎలా?..” రెడీ అయ్యి వచ్చి అంది అమృత.

“అడ్రస్ తెలుసుకున్నాను పద” అని బయటకు అడుగులు వేసాడు. ఇద్దరు కారెక్కారు.. డ్రస్, గిఫ్ట్‌లు కొని, తిరిగి కారు స్టార్ట్ చేసాడు వివేక్.

కారు వెళ్ళి సౌమ్య ఇంటి ముందు ఆగింది.

సంతోషంగా కారు దిగింది అమృత.. బెల్ ప్రెస్ చేసాడు వివేక్..

సౌమ్య భర్తలా ఉన్నాడు పవన్ వచ్చి.. తలుపు తీసాడు.. ఎవరో తెలియనట్లు చూడడం చూసి “సౌమ్య ఫ్రెండ్ అమృత” అని వివేక్ అనగానే

“రండి లోపలికి” అన్నాడు పవన్..

ఇద్దరు లోపలికి అడుగులు వేసారు.

అమృతని చూసి సౌమ్య మొఖం మాడిపోయింది.

“హమ్మయ్యా!.. మీరు ఇక్కడే ఉన్నారన్నమాట. ఎన్నిసార్లు ఫోను చేసినా ఎత్తకపోవడంతో.. ఇండియా వెళ్ళావని కంగారు పడ్డాను తెలుసా?.. ఏంటి! అలా చూస్తున్నావ్?.. నన్ను చూడగానే నీ మొఖం సంతోషంతో చాటంత అయ్యేది.. అవునులే!.. పెళ్ళయింది ఇక నేనేం గుర్తు ఉంటాను?.. మామూ!.. నువ్వు చెప్పింది కరక్ట్!.. వెళ్ళి చూద్దాం అని తీసుకు వచ్చావు” అని గభాలున దగ్గరకు వెళ్ళి.. సౌమ్య వైపు చూసి “రాస్కల్ చిన్ననాటి ఫ్రెండ్‌ని ఎంత తొందరగా మరిచిపోయావు? పాపా?.. బాబా!.. ఎక్కడ, చూపెట్టు.. నీ దగ్గరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.. ”

“నాకు మాత్రం సంతోషంగా లేదు. అసలు ఎవరు నిన్ను ఇక్కడకు రమ్మన్నారు? నేను నీ ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు అర్థం కాలేదా?” అని గభాలున లోపలికి వెళ్ళి తలుపు ధనాలున వేసి గడియ పెట్టింది.

కంగారుగా ఆశ్చర్యంగా చూసింది అమృత.

“సారీ!.. సారీ!.. మీరు ఏం అనుకోకండి.. తను.. సౌమ్య డిప్రషన్‌లో ఉంది.. నిజం చెప్పాలంటే తను.. ప్రస్తుతం కొంచెం మతి తప్పిన మాటలు.. అంటే ఎవరు నువ్వు అంటుంది.. ఏడుస్తుంది.. ఏమీ తినదు” అన్నాడు కళ్ళ నీళ్ళతో పవన్..

ఇద్దరూ షాక్ అయ్యారు.

“సారీ!.. డెలివరీ అయి, బిడ్డ” అని పవన్ అంటుడగానే “దానికి, పసి బిడ్డలంటే పంచ ప్రాణాలు.. అరడజను పిల్లలను కంటాననేది.. సిగ్గు లేదే.. పెళ్ళి కాకుండానే పిల్లలు పిల్లలంటావేమిటి?..” అంటే..“సిగ్గు ఎందుకు? అసలు పెళ్ళి – పిల్లల కోసమే చేసుకునేది అనేది. మామూ!.. నువ్వు డాక్టరువే కదా?.. సౌమ్య.. తిరిగి ప్రగ్నెంట్ అయి బిడ్డ పుట్టాక మాములవుతుందా? సౌమ్య.. తిరిగి ఎప్పటిలా అవుతుందా?..” అంది కళ్ళల్లో నీళ్ళు నిండుతుండగా అమృత.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా చూసాడు వివేక్. “మీరనుకున్నట్లు బాబు చనిపోలేదు.. బ్రతికే ఉన్నాడు.” అన్నాడు పవన్.

పవన్ మాటలకు అమృత, వివేక్ షాక్ అయ్యారు.

“ఏంటండి? మీరు చెప్పేది.. అసలు ఏం జరిగింది?” అన్నాడు వివేక్..

“చెప్పండి పవన్ గారు.. ఫోను చేస్తే గంటయినా వదిలేది కాదు.. అసలు ఏం జరిగింది? బాబు ఉన్నాడంటున్నారు..” అంది అమృత.

“రండి.. నాతో రండి.. ” అని గబగబా లోపలికి అడుగులు వేసాడు..

పవన్ వెనకాలే నడిచారు అమృత, వివేక్,

గదిలోకి వెళ్ళి“అటు చూడండి” అని అన్నాడు.

కంగారుగా చూసారు.. బెడ్ మీద పసిబిడ్డ ఉన్నట్లు కనిపించండతో గబగబా దగ్గరకు వెళ్ళారు.. పసి బిడ్డని చూసి షాక్ అయ్యారు..

అమృత కళ్ళనిండా నీళ్ళు.. గభాలున భజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు వివేక్..

పసిబిడ్డ రెండు కాళ్ళు వంకరలు తిరిగిపోయి ఉన్నాయి.. రెండు చేతులు కూడ వంకర తిరిగిపోయి ఉన్నాయి..

“ఎందుకు.. ఎందుకు.. ఇలా అయింది?” అంది జీరబోయిన గొంతుతో అమృత.

“కారణం! మేనరికం వలన బాబు ఇలా పుట్టాడట..”

భయంగా, కంగారుగా చూసి తల తిరుగుతుంటే.. గభాలున అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది.. “అమ్మూ!..” అని దగ్గరకు వెళ్ళి కంగారుగా చూసాడు వివేక్.

అమృత ముఖం నిండా చెమటలు పట్టాయి.. చేతులు వణుకుతుంటే.. గట్టిగా రెండు చేతులు ఒకదానిలో ఒకటి పెట్టి గట్టిగా నొక్కుకోసాగింది. పిచ్చిదానిలా అటూఇటూ చూడడం చూసి “అమ్మూ!.. కంట్రోల్ యువర్‍సెల్ఫ్.. వాటర్ తాగుతావా..” అని కంగారుగా అమృత భుజం మీద చెయ్యి వేశాడు వివేక్.

గభాలున వివేక్ చెయ్యి వైపు చూసి.. “చెయ్యి తీయ్ వి.వీ..” అంది.

ఆశ్చర్యంగా చూసాడు.

“సారీ అండీ.. సౌమ్య తరుపున నేను మరోసారి సారీ చెబుతున్నాను..” అన్నాడు పవన్..

“నో.. నో.. మీరు.. సౌమ్య.. ఎంత suffer అవుతున్నారో మాకు తెలిసింది” అని వివేక్ అంటుండగానే.. “మరి సౌమ్య మెంటల్ కండిషన్ ఎప్పుడు మామూలు అవుతుందన్నారు డాక్టర్లు.. దాన్ని అలా చూసేటప్పటికి..” అని ఇక మాట్లడలేని దానిలా వెక్కిళ్లు పడసాగింది అమృత.

“అమ్మూ!.. రిలాక్స్.. ముందు సౌమ్య, పరిస్థితిని అర్థం చేసుకొని వాస్తవంలోకి రావాలి” అని వివేక్ అంటుండగానే..

“సార్!.. మీరు Phd చేస్తున్నారని, డాక్టర్ అని సౌమ్య చెప్పింది.. ప్లీజ్ డాక్టర్!.. నా సౌమ్య తిరిగి మాములవుతుందా? కొంతమంది అంటున్నారు.. మరో బిడ్డ పుడితే సౌమ్య నార్మల్ అవుతుంది అని. రెండోసారి కూడ ఇలాంటి బిడ్డే పుట్టొచ్చు లేదా ఆరోగ్యంగా ఉన్న బిడ్డే పుట్టొచ్చు అన్నారు డాక్టరుగారు.. మీరు చెప్పండి” అన్నాడు పవన్.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా ఒక్క క్షణం ఆగి.. “పవన్ గారూ!.. ముందు సౌమ్య మాములుగా కావడానికి.. మనం ప్రయత్నించాలి.. సౌమ్యని చూస్తున్న డాక్టరుగారి పేరు, హాస్పటల్ details పంపండి.. నేను వెళ్ళి డాక్టరు గారిని మీట్ అవుతాను.. మీరు డీలా పడిపోకండి. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండి, సౌమ్యని చూసుకోవాలి” అన్నాడు వివేక్.

“వి.వీ!.. మనం.. మనం.. వెళదామా” అంది అమృత.

“మేము వీలు చూసుకొని మళ్ళీ వస్తాం” అని వివేక్ అడుగులు వేసాడు.. వెనకాలే నడిచింది అమృత..

“డాక్టరుగారు!..” అన్నాడు పవన్..

“వివేక్!.. అని పిలవండి.. మీకు ఏ హెల్ప్ కావాలన్నా.. మేము ఉన్నామన్న విషయం మరిచిపోకండి.. అస్సలు మొహమాట పడకండి!..” అని పవన్ చెయ్యి అభిమానంగా పట్టుకున్నాడు.

గభాలున పవన్‌ వివే‌క్‌ని హత్తుకొని.. “అందరికి దూరంగా ఇక్కడ ఉన్నా నాకు తోడుగా, నా వెంట సౌమ్య ఉండడంతో ఎప్పుడు నేను ఒంటరితనం ఫీల్ కాలేదు. కాని ఇప్పుడు..” అంటూ.. “.. సౌమ్య.. అసలు తిరిగి నార్మల్ అవుతుందాండి” అన్నాడు బేలగా..

“తప్పకుండా అవుతుంది.. ఓర్పు, సహనం ఉండాలి!.. తన పట్ల మీకున్న ప్రేమ తనని తిరిగి మాములు మనిషిని చేస్తుంది” అన్నాడు వివేక్.

“థ్యాంక్యూ అండీ” అన్నాడు కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా పవన్..

మౌనంగా కారు దగ్గరకు నడిచింది అమృత.

కారు బయలుదేరింది.. కారులో కూర్చుందే కాని కళ్ళల్లో నీళ్ళు నిండుతూ.. చెంపల మీదగా జారసాగాయి.

డ్రైవ్ చేస్తూ ప్రక్కకు తిరిగి అమృత వైపు చూసాడు.

కంగారుగా అన్నాడు వివేక్ – “అమ్మూ!.. ముందు కళ్ళు తుడుచుకో.. అనుకోనివి.. జరగడమే జీవితం!”

“ప్చ్!.. నువ్వు నిజంగా పిచ్చోడివే వి.వీ!.. అనుకోనివి జరగడమే జీవితం అని మన ఇద్దరికి ఎంగేజ్‌మెంటు రోజునే తెలిసింది.. ఆ విషయం వదలేయ్.. నువ్వు MBBS చదివి, పి.హెచ్.డి నీకిష్టం అని Phd చేయడానికి వెళ్ళావు మేనరికాలు చేసుకుంటే ఇలాంటి పిల్లలు పుడతారని నీకు తెలుసు కదా?” అంది..

ఒక్కక్షణం చూసి మౌనంగా డ్రైవ్ చేయసాగాడు.

“అర్దమయింది.. వివేక్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మా నాన్న గీసిన గీటు దాటకూడదనుకున్నావా?” అంది.

జవాబు రాకపోవడంతో కోపంగా అంది.. “మామయ్యని.. బాధపెట్టకూడదని, తను గీసిన గీటు మేనల్లుడు దాటడని, మా నాన్న అనుకోవాలని మన పెళ్ళికి మౌనంగా అంగీకరించావు.. ఈ విషయం చెబితే మా నాన్న అర్థం చేసుకొని.. మనిద్దరికి పెళ్ళి చేయాలన్న ఆలోచన మానివేసేవాడు ఏమో?” అంది.

మౌనంగా వివేక్ కారు డ్రైవ్ చేయడం చూసి “ప్చ్! తప్పు చేసావు మామూ.. ఇంత పెద్ద విషయం దాచి పెట్టడం ఏమిటి?” అంది.

“అమ్మూ! నువ్వు ఆవేశంలో ఆలోచించే శక్తిని కోల్పోయావు..” అంటూ..

“ఇప్పుడు.. USAలో నేను Phd చేస్తున్నది దేని గురించో తెలుసా? Hereditary diseases (అనువంశిక వ్యాధుల) మీద రిసెర్చ్ జరుగుతుంది. అసలు నేను Phd మేనరిక వివాహాలు గురించే చేయడానికి బలమైన కారణం ఉంది.. నేను హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు మేనరికం వివాహాలు చేసుకున్న వాళ్ళలో కొంతమందికి.. పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం, కొంతమంది వేరే ఇతర లోపాలతో పుట్టడం, ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏవడం చూసి.. Phd చేసి నేను కనిపెట్టిన థీసీస్ (thesis) అందరూ తెలుసుకొని, మేనరికం వివాహాలు చేసుకోవడానికి వెనకడుగు వేస్తారని ఆశపడ్డాను.. అలాంటి పిల్లలు పుడితే ఆ తల్లిదండ్రులు పడే బాధలు అంతా ఇంతా కాదు.. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొలది.. తల్లిదండ్రులు వంట్లో శక్తి పోయి.. వాళ్ళని చూసుకోలేక, తాము చనిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారు? ఎలా బ్రతుకు తారు?.. అన్న ఆలోచన వాళ్ళలో వచ్చి, విషం పిల్లలకిచ్చి, తాము కూడా తిని.. కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలియదు.. నాకు పిల్లలు కన్నా, తల్లిదండ్రులు వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకోవడం చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది.. తల్లిదండ్రులు బిడ్డకు జన్మ ఇచ్చినప్పుటి నుండి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయి ప్రయోజకులు అయ్యేదాకా ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు.. నేను చెప్పేది మేనరికం వివాహాలు చేసుకున్న వాళ్ళందరికి ఇలాంటి పిల్లలే పుట్టాలని లేదు.”

“సారీ వి.వీ.. I am really sorry.. ఈ మంచితనం చూసే నాన్న.. తను లేకపోయినా నా జీవితం బాగుటుందని నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. o.k. o k..” అంది అమృత.

(సశేషం)

Exit mobile version