[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
136
సూర్యుడ్ని చూసి వెక్కిరించడం సులువు
అతను అతని కాంతితోనే అన్ని దిక్కులా చూపబడుతున్నాడు
137
తాను ప్రేమించబడ్డానని ఒక్క ప్రేమికునికే తెలుసు గనుక
చెప్పుకున్నా రహస్యమే ప్రేమ
138
చరిత్ర నెమ్మదిగా దాని నిజాన్ని అణిచేస్తుంది
కానీ ఘోరమైన ప్రాయశ్చిత్త బాధలో
బతకడానికి ఆత్రంగా తిరిగి పోరాడుతుంది
139
నా శ్రమకు ఫలితం రోజు కూలీలో దొరుకుతుంది
ప్రేమలో నా అంతిమ మూల్యం కోసం, నేను ఎదురుచూస్తాను
140
అందానికి చాలు అని చెప్పడం తెలుసు
ఇంకా ఇంకా అని క్రూరత్వం అరుస్తుంది
141
దేవుడు నాలో చూడ్డానికి ఇష్టపడేది తన సేవకుడ్ని కాదు
అందరికీ సేవ చేసే తననే
142
పగటితో సామరస్యంలో రాత్రిచీకటి
ఉదయం మంచు ప్రతికూలం
143
గులాబులు విస్తారంగా ఉన్నప్పుడు ప్రేమే మద్యం –
వాటి రేకులు రాలిపోయి
ఆకలితో అల్లాడినపుడు ఆహారం
144
పరాయి ప్రదేశంలో
కవితో ఒక అజ్ఞాత పుష్పం అంటుంది
ప్రేమికుడా! మనం అదే మట్టికి చెందమా?
145
నా దేవుడ్ని నేను ప్రేమించ గలుగుతున్నాను
అతను అతన్ని కాదనడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చాడు గనుక
146
వాటి వేదనాభరిత అవమానపు ఏడుపుతో
నా సుతి చేయని తీగలు సంగీతం కోసం ప్రాధేయపడ్డాయి
147
తన పుస్తకాలు తాను తినని మనిషి
అసాధారణ అవివేకి అని పురుగు అనుకుంటుంది
148
నొసలు మీద రాసిన శాశ్వతత్వంలో
మేఘావృతమైన ఆకాశం ఈ రోజు
దైవిక దుఃఖ జాడల స్వప్నాన్ని మోస్తుంది
149
నా చెట్ల నీడలు దారినిపోతున్న వారి కోసం
దాని పండు నేను నిరీక్షిస్తున్న వానికోసం
150
యెర్రబారిన సూర్యాస్తమయ కాంతిలో
రాత్రి కోతకి సిద్ధపడి
పక్వాని కొచ్చిన పండులా ఉంది భూమి
(మళ్ళీ వచ్చే వారం)