[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
151
సృష్టి నిమిత్తం
భాగస్వామి కోసం
చీకటిని వెలుగు ఆమోదిస్తుంది
152
మురళి దాని యజమాని శ్వాస కోసం ఎదురు చూస్తుంది
యజమాని తన మురళి కోసం
153
గుడ్డి కలానికి రాస్తున్న చేయి అవాస్తవం, దాని రాత అర్థరహితం
154
చంద్రుని సమర్పణకు తనకు పూలైనా లేవని
సముద్రం దాని ఫలించని గుండెల్ని బాదుకుంటుంది
155
పండు కోసం దురాశ, పూవుని పోగొట్టుకొంటుంది
156
దేవుడు తన నక్షత్రాల గుడిలో
మనిషి కోసం ఎదురు చూస్తాడు, తనకోసం దీపం తెస్తాడని
157
చెట్టులో అణిగిన జ్వాల పూలకు రూపమిస్తుంది
సిగ్గుమాలిన జ్వాల చెఱనుండి విడుదలై, ఫలించని బూడిదలో చస్తుంది
158
చంద్రుడ్ని పట్టుకుందుకు, ఆకాశం ఏ ఉచ్చూ పన్నదు
దాని స్వేచ్ఛే దాన్ని బంధిస్తుంది
ఆకాశాన్ని నింపిన వెలుగు, పచ్చికమీద మంచుబిందువులో
దాని పరిమితిని అది వెదుక్కుంటుంది
159
సంపద పెద్దతనపు భారం
సంక్షేమం పూర్ణత్వపు ఉనికి
160
సూర్యుడ్ని ఎగతాళి చేస్తూ
గడ్డిపోచ దాని ఉత్సుకతకు గర్వపడుతుంది
161
సీతాకోకచిలుకకు
కమలాన్ని ప్రేమించేందుకు తీరికుంది
తుమ్మెదకు
తేనె సంగ్రహంలో తీరికలేదు
162
శిశువా
గాలి పిచ్చి కూతలు, నీరు,
నోరాడని పూల రహస్యాలు, మేఘాల కలలు,
ఉదయాకాశపు ఆశ్చర్య మూగ చూపులు
నువు నా హృదయానికి తీసుకొస్తావు
163
ఇంద్రధనుస్సు మేఘాల్లో గొప్పది కావచ్చు
కానీ పొదల్లో చిన్న సీతాకోకచిలుక ఇంకా గొప్పది
164
ఉదయం చుట్టూ వల అల్లి మంచు
వశపర్చుకుని దానిని గుడ్డిదానిని చేస్తుంది
165
వేగుచుక్కతో వేకువ గుసగుసలాడుతుంది
‘నువ్వు కేవలం నా కోసమే కదా’ అని
‘అవును’ అని జవాబు
‘ఆ అనామక పూవు కోసం కూడా’
(మళ్ళీ వచ్చే వారం)