మిణుగురులు-16

1
2

[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]

226
నక్షత్రాలు బయటకు రాకముందు సందెచీకటిలా
నా జీవితపు రిక్త మురళి
దాని అంతిమ గానం కోసం నిరీక్షిస్తుంది

227
నేల బంధనం నుండి విముక్తి
చెట్టుకు స్వేచ్ఛ కాదు

228
జీవితపు కథా యవనిక
కలుస్తూ తెగుతూ
ముడులుపడ్డ జీవితపు దారాలతో అల్లబడింది

229
పదాల్లో ఎన్నడూ బంధించలేని నా ఆలోచనలు
నా పాటల మీద వాలి నాట్యం చేస్తాయి

230
నిశ్శబ్ద చెట్టు హృదయంలో
బ్రహ్మాండం గుసగుసల మధ్య ఏకాంతంగా నిల్చుని
నేటి రాత్రి, నా ఆత్మ తనకుతానే కోల్పోతుంది

231
పనికిరాని మృత్యువు ఒడ్డున
సముద్రం విసర్జించిన ముత్యపు చిప్పలు
సృజనాత్మక జీవితపు వైభవోపేతమైన వ్యర్థాలు

232
నాకోసం సూర్యరశ్మి ప్రపంచ ద్వారాలు తెరుస్తుంది
ప్రేమకాంతి దాని నిధి

233
విరామాలతో పిల్లనగ్రోవిలా
నా జీవితం దాని ఆశల ప్రయోజనాల
రంద్రాలగుండా రంగులతో ఆటాడుకుంటుంది

234
నీకు నా ధన్యవాదాలు
నా నిశ్శబ్ద పూర్ణ శ్రద్ధాంజలిని దోచుకోనివ్వొద్దు

235
జీవితపు ఆకాంక్షలు
పిల్లల మారువేషంలో వస్తాయి

236
వాడిన పూవు నిట్టూరుస్తుంది
వసంతం శాశ్వతంగా అదృశ్యమైపోయిందని

237
నా జీవితం తోటలో
వెలుగునీడల నా సంపద పోగుచేసి
ఎప్పుడూ జమచేయలేదు

238
నాకు శాశ్వతంగా లబించిన ఫలం
నువు అంగీకరించినదే

239
మల్లెపువ్వుకు తెలుసు, ఆకాశంలో తన సోదరుడు సూర్యుడని

240
ప్రకాశం పసిది, అది ప్రాచీన కాంతి
నీడలు క్షణికం, అవి ముసలి

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here