[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
[dropcap]16[/dropcap]
నిర్జీవ గతం గుడికి
అర్చకురాలులా ప్రస్తుతాన్ని చంపి
జ్ఞాపకం తన హృదయాన్ని సమర్పిస్తుంది
17
గంభీరమైన చీకటి గుడినుండి
మట్టిలో ఆడుకుందుకు పిల్లలు పారిపోతారు
దేవుడు వాళ్ల ఆటను చూస్తూ
పూజారిని మరచిపోతాడు
18
సెలయేరులా
దాని సొంత ఆకస్మిక నీటి వివరణకి
మరోమారు చేయని ఆలోచనల ప్రవాహంలో
నా బుద్ధి ఏదో మెరుపుకు తుళ్లిపడుతుంది
19
దాని సొంత ఎత్తు తెలుసుకుందుకు
కొండలో నిశ్శబ్దం పైకి లేస్తుంది
దాని లోతు చూసుకుందుకు
సరస్సులో కదలిక ఆగిపోతుంది
20
కళ్లుతెరవని ఉదయం కళ్లమీద
పోతూపోతూ
రాత్రి పెట్టిన ఒక్క వీడ్కోలు ముద్దు
వేకువ నక్షత్రాన్ని వెలిగిస్తుంది
21
కన్య అందం
తెలుసుకోలేని ఉద్విగ్న రహస్యం
ఇంకా పక్వానికి రాని పండులాంటిది
22
తన జ్ఞాపకాన్ని కోల్పోయిన దుఃఖం
నోరులేని చీకటి సమయంలా
పక్షి పాటలైనా లేని కీచురాయి శబ్దం లాంటిది
23
మతాంధత
నిజాన్ని చేతిలో భద్రపర్చుకుని
పిడికిలితో దాన్ని చంపుతుంది
దుర్బల దీపానికి ధైర్యంగా
తన అన్ని నక్షత్రాల్నీ రాత్రి ఘనంగా వెలిగిస్తుంది
24
తన బాహువుల్లోనే
భూవధువు ఉన్నా
అందనంత దూరంలో ఆకాశం ఉంటుంది
25
అనుచరులనుండి దేవుడు ప్రేమను కోరతాడు
బానిసలనుండి దెయ్యం విధేయత కోరుతుంది
26
చరిత్ర ధూళిలో కలిసిపోకుండా
నిత్యయవ్వన కాలరహస్యంలోనే
శిశువు నిత్య నివాసం
27
సృష్టి మెట్లమీద ఒక చిరునవ్వు
సమయాన్ని దాటిస్తూ
వేగంగా తీసుకుపోతుంది
28
ఉపకారానికి బదులుగా చెట్టుని
తనతోనే కట్టి ఉంచుకుంటుంది నేల
ఆకాశం ఏమీ అడగదు
స్వేచ్చగా వదిలేస్తుంది
29
తళతళ మెరుస్తున్న క్షణాల్ని తప్ప
నిత్యమైనదానిలా వజ్రం
వయస్సు పెరిగినా గొప్పలు చెప్పుకోదు
30
దూరపు బంధువైనా
ఎవరైతే ఉదయం నా దగ్గర కొచ్చారో
వారిని రాత్రి తీసుకుపోయాక వారు మరీ దగ్గరయారు
(మళ్ళీ వచ్చే వారం)