మోహన వీణ

0
3

[dropcap]సూ[/dropcap]ర్య కాంతి వెలుగులు ప్రకృతి అంతా నిండాయి. రాఘవ మంచి కవి. చాలా పుస్తకాల్లో రాస్తాడు. అతని మొత్తం జీవితం కవిగా స్థిర పడాలనే ఆశ. కానీ పెద్దలు ఒప్పుకొరు కదా. ఇంజనీరింగ్ డిప్లమో ఉన్న ఊరిలోనే చేశాడు.

ఉన్న ఊళ్ళోనే పంచదార ఫ్యాక్టరీ ఉన్నది. అందులో చేరమని పెద్దల ఆదేశం. కడుపులో నీళ్ళు కదలవు. ఉన్న ఆస్తి చూసుకోవచ్చును, పెద్దల్ని చూసుకోవచ్చును. డబ్బుకు అంతు ఏమున్నది?

ఇంట్లో పెద్ద వాళ్ళ ఆస్తి చూస్తే చాలు. దగ్గర సంబంధం ఉన్నది, అది చేస్తే పిల్లకి ఐదు ఎకరాలు కట్నం వస్తుంది. కొంత పొలమున్నది. దానికి పెళ్ళాం ఆస్తి కలిస్తే ఇంకా మంచిది: సరే పెద్దవాళ్ళు ఏది అంటే అదే చెయ్యాలి అన్న సంప్రదాయ కుటుంబం. అదే మంచిది పిల్లలకు. స్వాతంత్ర్యం చదువులో ఇవ్వాలి కానీ పెళ్లి విషయంలో వద్దు అంటారు. కనుక వినే తత్వం ఉన్నది.

ఎరగని రంభ కన్నా ఎరిగున్న కోతి మేలు అని వాళ్ళ అభిప్రాయం. కానీ పిల్ల కూడా చూపరే బాగుంటుంది బాపు బొమ్మల ఉంది అంటారు

కానీ మన రాఘవ చూడలేదు. ఎప్పుడు తల వంచి ఉండటమే కానీ తల ఎత్తి సమాధానం ఉండదు. కారణం పెద్దలకు చెందిన సంబంధాలు అయితే వాళ్ళే చూసుకుంటారు.

ప్రేమ పెళ్లి అసలు చేత కాదు. కానీ ప్రేమ విషయంలో ఎంతో మందివి రకరకాల సూచనలు చూసాడు, చదివాడు. వాళ్ళు అంతా తనకి ఆదర్శం, ఆదేశం. కానీ ప్రేమ అనేది పెళ్లి తరువాతే కదా అనే భావన ఉన్నది.

కనుక పెద్దలు చేసిన పెళ్ళిలో సజావుతనం వర్తిస్తుంది. అటు ఇటు బంధువులు అంతా కూడా హర్షిస్తారు. బావలు మేనమామలు అందరూ కూడా ఆనంద పడతారు.

అదే ప్రేమ పెళ్లిలో భయం ఆందోళనను పొంది, అటు ఇటు ఎవరు లేక స్నేహితులు మాత్రం వస్తారు. వాళ్ళు ఎంత వరకు? సంతకాల వరకూ ఉంటారు. ఆ తరువాత ఎవరి చిరునామా వారిది ఒకరితో ఒకరు చెప్పుకోవడం అరుచుకోవడం తప్ప వేరే ఏమీ ఉండదు. అందుకే ఆధునిక పద్దతి ప్రేమ పెళ్లి వద్దు అని గట్టిగా నిర్ణయం చేసి తన పని తాను చేసుకుంటూ పెద్దలకు అనుకూలంగా ఉండటానికి అలవాటు పడ్డాడు. అదే సుఖము.

నెమ్మదిగా ఉండే అబ్బాయిలు చాలా తక్కువ ఉంటారు, కానీ మన రాఘవ చాలా మంచివాడుగా పేరు వచ్చేసింది.

రాఘవ అక్క మోహన వీణ. మగ పిల్లాడే అలా పెరిగితే ఇంకా ఆడపిల్ల సంగతి ఏమిటి? ఒక్క కొడుకు ముగ్గురు ఆడపిల్లలు. పై వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి చేశారు.

మోహన వీణ పి.జి. చేసింది ఉద్యోగం చెయ్యాలని కోరిక అని ఖచ్చితంగా చెప్పింది.

***

జీవితం అంటే ఎన్నో సమస్యలు వాటికి సమాధానాలు పెద్దల నుంచి తప్ప పిల్లల నుంచి ఏమి చెపుతారు? పెద్దల ప్రేమ కావాలి. జీవితంలో మనిషి పుట్టినది మొదలు ఎన్నో బాధ్యతలు.

ఎల్.కె.జి మొదలు ఎన్నో రకాల బాధ్యతలు. స్కూల్‌కి వెళ్ళాలి, అన్ని చదవాలి. అక్కడ ర్యాంక్‌ల పరుగులో అలసిపోయాను, ఎంతో సొలసి పోయాను అంటున్నారు పిల్లలు. అక్కడ తల్లి తండ్రికి మంచి పేరు తేవాలి. బుద్దిగా ఉండాలి. పదిమందిలో గొప్పగా ఉండాలి. ఎవరి మెప్పు కోసమో జీవితమంతా పరుగులు తప్పవా? నలుగురిలో పేరు బాగా గొప్పగా తేవాలి అంటే ఎలా? తెచ్చుకోవడం అంతా తేలిక కాదు. జీవితం కోసం ఇప్పుడు మూడేళ్లకే పోటీ మొదలు. అలా పరుగు పెట్టీ ముందుకు వెళ్ళాక మా పిల్లలు అంతా గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడానికి ఎంత కష్టపడాలి? స్వతంత్ర అలోచన, అనందం ఏమి ఉండకూడదు. పెద్దలు చెప్పినట్లు వినాలి. పెద్దలకి నచ్చినట్లు ఉంటేనే జీవితం, లేకపోతే వాళ్ళ పిల్లలు పొగరుమోతులు, ఎవరి మాట వినరు పెంకిగా పెంచారు. ఇంట్లో వాళ్ళ మాట వినరు, ఇంకా పై వాళ్ళ మాట ఏమి వింటారు అంటారు.

నేటి తల్లుల పిల్లల్ని విద్యావంతులు చేసి పెళ్లి చేస్తున్నారు. ‘వంట వార్పు అంతంత మాత్రమే నండి; పని పాటా రాదు. ఏదైనా అంటే వంట పొయ్యి నేర్పుతుంది, నాలిక రుచి నేర్పుతుంది.’ అని ధీమాగా చెపుతారు.

మోహన వీణ ఎం.ఎ. సైకాలజీ చదివింది. అప్పటి రోజుల్లో పిలిచి ఉద్యోగం ఇచ్చేవారు. భర్త విశాఖలో గొప్ప పేరున్న ఇంజినీర్. పెద్ద భవన నిర్మాణ కార్యాలయం ఉన్నది. అతని చేతికింద ఓ యాబై మంది పని వాళ్ళు వివిధ కేటగిరీలో ఉన్నారు. ఎవరికైనా సరే అరు నెలల్లో మంచి భవనం కట్టించి పెట్టగలరు. అన్ని దగ్గర ఉండీ అతనే చూసుకుంటాడు.

మోహన వీణ కూడా మంచి వ్యక్తి. మంచి చిత్రకారిణి. భర్త వేసే భావనా చిత్రాలలో ఆనందంగా రంగులు వేస్తూ ఉంటుంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి. అదృష్టం కొద్ది యూనివర్సిటీ జాబ్ రావడంతో ఆక్కడే పెద్ద బిజినెస్‌లో ఉన్న రావ్ సంబంధం కుదిర్చారు.

మంచి హోదాలో పెళ్లికి ఉన్నాడు. మోహన వీణ సైకాలజీ లెక్చరర్‌గా పనిచేసేది.

భర్త కొన్నాళ్ళు కారులో దింపేవాడు. బాధ్యతలు పెరిగే కొద్ది సమయాలు మారడం వల్ల వీణ స్కూటీలో వెళ్ళడం అలవాటు చేసుకున్నది.

ప్రపంచంలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు నెమ్మదస్థులు, మంచి వాళ్ళు ఉంటారు.

ఆయన సమయం ఆయనది, ఆవిడ సమయం ఆవిడది. ఒక ఇంట్లో జీవిస్తున్నా ఎవరు పని వారు చేసుకుని ఆఫీసులకు వెళ్లడమే.

మోహన వీణ ఒక అక్క రూప దుబాయ్‌లో ఉన్నది. రెండవది దీప ఖమ్మంలో ఉన్నది. ఎవరి జీవితాలు జీతాలు వారివి. చుట్టం చూపుగా వస్తారు వెడతారు. అమ్మ నాన్న తమ్ముడు ఇవేమీ వాళ్ళకి పట్టవు. వీణ ఒక్కతే మంచి చెడులు ఆలోచిస్తుంది.

ఈ రోజుల్లో డిగ్రీ చదువుతో ఇంటి పట్టున ఉండే అమ్మాయిలు లేరు. అసలు ఆడపిల్లలే దొరకడం లేదు. ఇంకా ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళని చూసుకుంటూ వంట చేస్తూ ఉండాలి, అంటే మరీ కష్టంగా ఉన్నది.

“వాడిన మీరు ఇంట్లో ఉంచేసారు. వాడి డబ్బు చాలదు. పిల్లలు ఎదిగితే అన్ని ఖర్చులు కదా. పొలాల సిస్తులు ఏవిధంగా ఉన్నాయి అన్నది మీకే తెలుసు. ఒకసారి పండి, ఇంకోసారి పండలేదు అంటారు. కనుక చిన్న ఉద్యోగిని చూసి చేస్తే మంచిది. స్కూల్ టీచర్ అయితే బాగుంటుంది. ప్రభుత్వ జీతం అయితే మంచిది” అంటూ అలా ఇష్టపడ్డ టీచర్‌ని చూడమన్నది.

కారణం, కొంత ఉన్నది పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి.

“సరే అలాగే చూస్తాము” అని తల్లి తండ్రి అన్నారు.

పిల్లల్ని పెంచాలి అంటే ఎంతో ఖర్చు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు.

రాఘవ ఏమీ మాట్లాడలేదు. కట్నం మటుకు పుచ్చుకోవద్దు అని చెప్పాడు. పిల్ల సామాన్యంగా ఉంటే చాలు; మాకు గొప్పలు టెక్కులు, జోష్, హోష్‌లు వద్దు. మంచి పిల్ల చాలు అన్నారు. పెళ్లిళ్ల పేరయ్యకి ఈ వివరాలు చెప్పారు.

ఎవరూ రాసి ఉన్నారో తెలియదు కదా. వెతుకులాట తప్పదు.

***

మోహన వీణ ఉద్యోగంలో బిజీ. ఇద్దరు ఆడపిల్లలు. ఎన్నో ఎదుర్కొని కుటుంబం నిలబెట్టుకున్నది. కొంచెం తెలుసు. కొంచెం బంధుత్వం ఉన్నా సరే కోడలు అనగానే అత్త పెత్తనం తప్పదు. ఇద్దరు పెళ్లి కాని ఆడపడుచులు ముగ్గురు మరుదులు, పెద్ద కొడుకు బాధ్యతలు ఉన్నాయి. కనుక “మీ పిల్ల జీతం మాకు వద్దు కానీ అవసర ఖర్చులు తప్పవు” అన్నారు.

మామగారు ప్రైవేట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఓ మరిది రైల్వే. ఇంకో మరిది ప్రైవేట్ జాబ్. ఇంకా ఆడపిల్లలు డిగ్రీ చదువుతున్నారు. ఈలోగా ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. పెద్ద ఉద్యోగి కావాలి.

మోహన వీణ మాత్రం ఇంట్లో అత్తగారు వెనుక వంట పని చేసుకుని బాక్స్ సర్దుకుని భర్తకి హాట్ క్యారేజ్ సర్ది ఇచ్చేది. అత్తగారికి అది నచ్చేది కాదు. అన్నం నేనే సర్దాలి అనేది. అక్కడ రోజు కోపమే ఉండేది. కానీ పైకి ఏమి అనలేక పోయింది.

కాల గమనంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారు అమ్మ కోసం వెతుకులాట. ఆడపడుచులు ఉన్నా చూసేవారే కాదు. ఒక రోజు యూనివర్సిటీ నుంచి వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరు ఇసకలో పుస్తకాలు పడేసి ఆడుకుంటున్నారు. ఇంటికి వస్తూనే అక్కడి పరిస్థితికి బాధ పడింది. బయట ఆడుతున్న ఉన్న పిల్లలని లోపలికి తీసుకెళ్ళేవారు లేరు. ఇదే విషయం చాలా బాధపడి చెప్పాలని అనుకున్నది. వెంటనే కుదరలేదు.

ఒక రోజు పిల్లల విషయంలో భర్తతో పెద్ద చర్చ జరిపి ‘వేరే వెళ్ళాలి’ అన్నది. అందుకు అతను ఒప్పుకోలేదు.

‘పైన మేడ వేస్తాను’ అని చెప్పి మంచి రోజు చూసి మొదలు పెట్టాడు. ‘ఉమ్మడి ఆస్తి ఇది, మీరు ఇందులో పెడితే ఎలా’ అన్నా వినలేదు. అడపిల్లలకి పెళ్లి కావచ్చు, కాకపోవచ్చును. వాళ్ళకి కట్నం డబ్బు ఉన్నది. మనం ఇల్లు వాళ్ళకి వదిలేద్దాం అని ముందే చెప్పాడు

“మనకి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి ఈ ఇల్లుతో పని లేదు. నా చేతిలోని పనే వేరే వాళ్ళకి ఇస్తాను” అని చెప్పాడు. “నువ్వు పిల్లలు సుఖంగా ఉండాలి” అన్నాడు. ఊ అనక తప్పదు కదా, ఉమ్మడి కుటుంబం. పెద్ద అన్నగారు అన్ని బాధ్యతలు అతనివే. ఏదైనా అంటే ‘నీ పెళ్ళాం ఉద్యోగస్థురాలు. ఆఫీసులలో పనిచేసే వారికీ ఇంటి పని కుదరదు’ అంటూ విమర్శించేవారు.

పెళ్లి ముందు మాటలు వేరు పెళ్లి తరువాత మాటలు వేరు. మోహన తప్పదు అనుకుని తన పని చూసే వాళ్ళు లేక పిల్లల్ని పెంచడానికి ఒక ముసలమ్మని వృద్ధుల ఆశ్రమం నుంచి తెచ్చిపెట్టుకొన్నది.

సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. వచ్చిన కళాకారులు తెలుసున్న వారు అయితే వాళ్ళ ఇంట్లో అతిథ్యం ఇస్తుంది.

ఒకసారి తెలుసున్న వారి అమ్మాయి మద్రాస్ నుంచి కచ్చేరికి వచ్చింది. అమెను తన యూనివర్సిటీకి తీసుకెళ్ళింది. డిపార్ట్‌మెంట్ చూపించి తీసుకు రావడంలో రెండో పిల్లని స్కూల్ నుంచి తీసుకుని వచ్చింది. ఆ పిల్ల కార్లో నిద్ర పోయింది.

“ఎలా పోయిందో జోడు. కింద పడింది. ఇవి యూనిఫాం జోడు. మళ్లీ స్కూల్ లోనే కొనాలి. రేపు క్లాస్ రూమ్‍లో చూడమనాలి. లేదంటే ఈ నెలలో అదనపు ఖర్చు వెయ్యి రూపాయలు” అన్నది మోహన.

ఆ మాటలకి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి “అదేంటి పిన్ని?” అన్నది.

“అది… అంటే సంపాదించే పెళ్ళాం రిజర్వ్ బ్యాంక్ లాంటిది. నా పిల్లల ఖర్చు నేనే పెట్టుకోవాలి. కారణం ఏడాదికి ఒకసారి మీ బాబయ్య కొంటారు. ఇధి అదనపు ఖర్చు కదా” అని నవ్వింది.

“బాబయ్య గారు చాలా మెత్తగా ఉన్నారు. అదేంటి అలా అంటావు” అన్నది.

“అది అంతేలే” అన్నది. ఇల్లు రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది.

కచ్చేరి అయ్యాక మళ్ళీ కార్లో తీసుకెళ్ళి ఇంట్లో ఘనంగా భోజనం పెట్టి మద్రాస్ రైల్ ఎక్కించారు.

అడబడుచులు ‘ఎవరూ వచ్చారు’ అంటూ పైకి వచ్చి కనకాంబరాలు దండ ఇచ్చి వెళ్లారు. విషయం తెలుసుకోవాలి అని కుతూహలంగా చూస్తూ అడిగారు.

“ఆ  మా చుట్టాలు. మా కజిన్ కూతురు, మంచి సంగీత విద్వాంసురాలు” అని చెప్పింది.

“ఓహో, మీ చుట్టాలా” అంటూ వెళ్ళిపోయారు.

మోహన భర్తకి తన చెల్లెళ్ళు తమ్ముళ్ల గురించి తెలుసు, కాని ఇంటి భారతం తప్పదు కదా. అందుకే విడిగా కూతుళ్ళకు ఇళ్లు కట్టారు. పెద్ద పిల్ల అమ్మ ఉద్యోగంతో విసుగు చెందింది. “నేను కాన్వెంట్‌కి వెళ్ళను” అని చదువు మానేసింది. ట్యూషన్ పెట్టుకుని ప్రైవేట్‌గా మెట్రిక్ కట్టింది. అది మంచి మార్కులతో పాస్ అయింది. డైరెక్ట్‌గా బి.కామ్‌కి కట్టింది. తండ్రి దగ్గర అకౌంట్స్ వర్క్ నేర్చుకున్నది.

రావ్ తన ఫ్రెండ్ కొడుకునిచ్చి పెళ్లి చేసి అతన్ని తన బిజినెస్‍లో పార్టనర్‌గా పెట్టుకున్నాడు.

రెండో పిల్ల ఇంజినీరింగ్ చదివింది. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న ఒక తెలిసున్న సంబంధం చేశారు.

ఆడబడుచు ఒకామెకు పెళ్లి చెయ్యడం గగనం అయింది. మేనత్తల పోలిక వస్తే పెళ్లి కాదేమో అనే భయం ఉండేది. రెండో ఆడబడుచుకు రావ్ తల్లిని తండ్రినీ వప్పించి పెళ్లి చెయ్యడం కష్టం అయింది.

“నీ పిల్లల పెళ్లిళ్లు అయ్యాక నా పిల్ల పెళ్లి చేస్తావా” అని తల్లి కొంచెం బాధపడింది.

“నాదేముంది? అంతా మోహన చేసింది. అమె కుటుంబం నడిపింది. నేను డబ్బు సంపాదించే యంత్రాన్ని” అన్నాడు. మొత్తనికి ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ఆ తర్వాత నెమ్మదిగా తమ్ముళ్ల పెళ్ళిళ్ళు చేశారు.

కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళ ఇష్ట ప్రకారం అనేటప్పటికి ఎప్పటికీ ఒక కొలిక్కి రావు.

నానాటి బ్రతుకు నాటకము అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం అర్థం చేసుకుని జీవితాన్ని పదిలంగా చూసుకోవాలి.

***

మోహన ధైర్యం చేసి ఒక టీచర్‌ని చూసి రాఘవకి పెళ్లి చేసింది. ఇంట్లో వంట మనిషిని పెట్టి మరదలిని జాగ్రత్తగా చూడమన్నది.. నేటి తరంలో అబ్బాయి పెళ్లి చాలా కష్టంగా ఉన్నది. పెళ్లి కాగానే సరా, ఆ పిల్లని బాగా చూసుకుని కుటుంబం బాగా నిలబెట్టుకునే బాధ్యత కుటుంబంలోని అందరిపై ఉన్నది.

కాల గమనంలో రాఘవ ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాడు. అన్ని కూడా సవ్యంగా జరిగేలా అందరూ సహకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here