Site icon Sanchika

‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ – కొత్త ధారావాహిక – ప్రకటన

శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.

***

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా అతి త్వరగా అభివృధ్ధి చెందుతున్న సమాజం, మనిషికి ప్రాథమికంగా ఉండవలసిన విలువలను కోల్పోయే పరిస్థితి వస్తోంది.

“ఈ ప్రపంచం సరైన త్రోవలో నడవాలంటే ముందు మనం మన జాతిని సరైన త్రోవలో పెట్టాలి. జాతిని సరైన త్రోవలో పెట్టడానికి కుటుంబాన్ని సరైన పధ్ధతిలో వుంచాలి. కుటుంబాన్ని సరైన పధ్ధతిలో వుంచాలంటే మన వ్యక్తిగత జీవితాన్ని సంస్కరించుకోవాలి. దానికోసం ముందు మనం మన మనసుని పధ్ధతిలో పెట్టుకోవాలి..” అన్న చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాటలు పూర్తిగా నమ్మినవాడు ప్రభాకరం.

చిన్నప్పటినుంచీ తల్లితండ్రులు తప్ప వేరే బంధువులంటూ తెలీకుండా పెరిగిన మీనాక్షికి కుటుంబం అంటే ప్రాణం. ‘తన’ అనే కుటుంబ సభ్యుల కోసం తనకున్న ప్రతిభను తనలోనే దాచుకున్న మీనాక్షి ప్రభాకరం భార్య.

మనిషికీ మనిషికీ మధ్యన ఉండవలసిన అవగాహన, ప్రేమ, అభిమానం లాంటివి ఎలా నిలబెట్టుకోవాలో తెలిపేదే ఈ చిన్న నవల.

***

వచ్చే వారం నుంచే

సంచికలో

చదవండి.. చదివించండి..

మౌనమె నీ భాష ఓ మూగ మనసా!

Exit mobile version