Site icon Sanchika

శ్రీమతి కోడూరి పార్వతి స్మారక ప్రప్రథమ విశిష్ట పురస్కార ప్రదానోత్సవం

[dropcap]సా[/dropcap]హితీ సిరికోన మరియు కోడూరి పార్వతీపీఠం సమర్పణలో కీ.శే. శ్రీమతి కోడూరి పార్వతి స్మారక ప్రప్రథమ విశిష్ట పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 24 తేదీన అంతర్జాల వేదికగా అపూర్వంగా జరిగింది.

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం డీన్ ప్రముఖ కవి, బహుభాషావేత్త, విద్వద్వరిష్టులు ఆచార్య రాణి సదాశిమూర్తిగారికి కోడూరి ‘విశిష్ట పండిత పురస్కారం’, ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మికి కోడూరి పార్వతి ‘విశిష్ట రచయిత్రి పురస్కారం’ అందచేసారు.

ఈ సమావేశం సిరికోన వాట్సప్ అధిపతి, పూర్వ ద్రవిడ విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ గారు నిర్వహించగా, పురస్కార ప్రదాత కోమల కవితా వల్లభ బిరుదాంకితులు డాక్టర్ కోడూరి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా తిరుపతిలోని రాణి సదాశివ మూర్తిగారి స్వగృహంలో వారిని దర్శించి సత్కరించారు.

అలాగే అత్తలూరి విజయలక్ష్మి గారిని సిరికోన సభ్యులు ఎన్. ఎన్. రాజు గారు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా శ్రీ పాలడుగు శ్రీచరణ్, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, ఉపద్రష్ట సత్యం గారు, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు పాల్గొని పురస్కార గ్రహీతలను అభినందించారు.

Exit mobile version