[dropcap]సూ[/dropcap]ర్యుడి పరుగును ఆస్వాదిస్తూ మేడ మీద స్కిప్పింగ్ ఆడుతోంది మృదుల శ్రీ. ఆధునిక హంగులు ఉన్న ఇల్లు కాదు, అయినప్పటికీ పూర్వీకుల ఇల్లు. పెద్ద వాళ్ళు ఉన్న ఇల్లు. అందరికీ ఆ అదృష్టం ఉండవద్దూ? తాత బామ్మ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు.
ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పిల్లని చెయ్యరు పిల్లాడిని ఇవ్వరు.
దగ్గరలో పిల్లగాలి వస్తుంది కారణం అక్కడ తామర కమలాల చెరువు ఉన్నది. కొబ్బరి చెట్టు ఇంటికి చుట్టు ఉంటాయి. దొడ్లో మామిడి చెట్టు, సపోటా చెట్టు ఉన్నాయి. అన్ని బాగా ఉంటాయి. మంచి వాతావరణము. కేవలం చదువు కోసం ఇవన్నీ సుఖాలు వదులుకోనవసరం లేదు. ఇది ఆ యింటి పెద్దల ఆలోచన.
ఎక్కడ ఉన్నా సూర్యోదయానికి మార్పు లేదు. విదేశాల్లో మంచు, స్వదేశంలో పిల్ల గాలి. ఉదయాన్నే కాపీ టిఫిన్లు కావాలి. ఇక్కడ కష్టం లేకుండా కంచంలో అన్ని దొరుకుతాయి. అక్కడ మనం ఎంతో కష్టపడి సంపాదించి వండుకుని తినాలి. స్వతంత్ర భావాలు, స్వతంత్ర జీవితం అంటూ పిల్లలకు దూరంగా ఉండటం అలవాటు చేస్తారు. అక్కడ వారికి ఎవరో ఒకరి సహాయం కావాలి కదా. అలా స్నేహంతో ఒకరి అవసరాల కోసం మరొకరు సహాయ పడాలి. అదే మానవ జీవితము.. ఆ సహాయంతో ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం అవగాహన కలిగి పెళ్లికి దారి సుగమం చేసి పెళ్లి బాట పడతాయి. దాన్ని ప్రేమ అంటారు
కానీ మనిషికి అవసరంలో సహాయపడిన వ్యక్తి పై వయసుని బట్టి ప్రేమ, ఆప్యాయత ఆదరణ అన్నవి వస్తాయి. అందుకే కొందరు పిల్లల్ని దూరంగా పెంచడానికి ఇష్టపడరు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో హాస్టల్ జీవితానికి ఇష్టపడరు. అక్కడ స్వేచ్ఛా జీవితం ఉంటుంది అనే భయం పెద్దలకి ఉంటుంది.
కుటుంబంలో మనుష్యులు – ధనం, గొప్ప కాదు; సంస్కారం ఉండాలి అని చెపుతారు. డబ్బు ఉంది కదా అని డాబు కబుర్లు చెప్పరు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండేలా పిల్లల్ని పెంచుతారు. అది కొందరికే పరిమితం.
మృదుల శ్రీ తండ్రి తల్లి మేనత్త మేనమామ బిడ్డలు. కంచంలో కంచం కుర్చీలో కూర్చి అంటూ దగ్గర సంబంధం పెద్ద పిల్లకి చేశారు. అలాగే అటు ఇటు పెద్దల్ని రాఘవరావు చూస్తున్నాడు
ఊళ్ళోనే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్. బదలీలు తక్కువ ఏదైనా ఆఫీస్ పని ఉంటే తనే వెళ్లి ఉండేవాడు. పెద్ద వాళ్ళకి సిటీలో మంచి ఇల్లు అద్దెకు దొరకదు అయిన తన కోసం వీళ్ళని అక్కడ పెట్టే కన్నా, తను ఒక్కడు వెళ్లి ఉండటం మంచిది. ఆ ఉద్దేశంలో దూరంగా ప్రభుత్వ ఉద్యోగాలు, కంపెనీ ఉద్యోగం వచ్చినా పెద్దల కోసం ఆలోచించి త్యాగం చేశాడు. కానీ కొందరు అది ఒప్పుకోరు. అత్త ఇంట సుఖం ముందు పట్నం ఉద్యోగం లాభం ఏమిటి? వచ్చింది ఖర్చులకి పోతుంది అంటారు. లోకో భిన్న రుచి!
పెద్దల మాటకు విలువ ఇచ్చి భార్యను అప్పుడప్పుడు సిటీకి తీసుకు వెళ్ళి ఊరు చూపించి వచ్చేవాడు. సుప్రజ పేరుకి తగ్గట్టే ఉంటుంది. ఆ పెద్ద వాళ్ళు కూడా ఆమెకు శతవిధాల తగినట్లు ఉంటారు. ఊరికే విసుగులు వంకలు పెట్టరు. వారికి ఏకైక మనుమరాలు మృదుల శ్రీ. మిగిలిన వాళ్ళకి కొడుకులు. ఇప్పుడు వన్ ఆర్ నన్ కదా. అందరికీ ఒక్కొక్క కొడుకు. అటు ఇద్దరు కూతుళ్ళు ఇటు ఇద్దరు కొడుకులు ఉన్న కుటుంబం పెద్ద పిల్ల సుప్రజను కలుపుకుని మిగిలిన ఇద్దరికీ బయటి సంబంధాలు చేశారు. వాళ్ళు ఎవరు తిన్న వాళ్ళు ఉంటారు, ఏదైనా ఫంక్షన్ అయితే వస్తారు. సెలవు లేదని వెళ్లి పోతారు. సారే చీర ఘనంగా పెట్టే పంపుతారు.
ఇప్పుడు మృదుల శ్రీ ఇంటర్ చదివింది. “అంతా ఆన్‌లైన్ విద్య కదా, పై చదువు అనవసరము” అన్నారు. “బయట ఫీజులు కట్టడమే కానీ క్లాసులు లేవు. ఇప్పుడప్పుడే అన్ని బాగుపడవు, కనుక ఓపెన్ యూనివర్సిటీ లో కోర్సులు చేరు” అన్నారు. “ఆ తరువాత కావాలంటే వేరే పై చదువు చదవవచ్చు” అన్నారు.
సరే సంగీతం మాస్టారుని పెట్టి వోకల్ నేర్పించారు. కుట్టు టీచర్ వచ్చి కుట్టు నేర్పింది. ఇక కంప్యూటర్ చిన్న క్లాస్ నుంచి అలవాటు కనుక అవి అన్నీ బాగానే చేస్తుంది.
ఆడపిల్ల ఎంత చదివినా గృహ అలంకరణ, ఇంటి అందాల అంశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఎంత తెలుగు పై అభిమానం ఉన్న సరే బయటి ప్రపంచంలో ఇంగ్లీషు రానిదే దరఖాస్తు ఫారాలు ఇతర పనులు తెలియవు. ఇప్పుడు అన్ని ఫోన్ పే, గూగుల్ పే లు కట్టలన్నా అన్ని ఇంగ్లీష్ పదాలతో మనకు అలవాటు ఉండాలి. కనుక మరి ఆ విద్య తప్పదు. స్పెషల్ ఇంగ్లీష్ తీసుకుని ఇంట్లో దివాన్ మీద లాప్‌టాప్ పెట్టుకుని అన్ని చదువులు చదువుకునే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకు? ఆ కాలేజి చదువు ఎందుకు ఆ హాస్టల్ జీవితము? ఇంట్లో సుఖాలు ఉండగా అక్కడ ఆ చదువు కోసం సమస్యలు అంటారు.
కానీ ఇప్పటి క్లిష్ట కాలంలో పిల్లల చదువు, ఇంటి వద్ద తిండి, ఇంటి వద్ద అన్ని పనులు శుచిగా శుభ్రంగా ఎవరు అంతట వారు చేసుకోవడం ఎంత బాగుంది? ఇధి ఇలా జాగ్రత్తలతో జీవితం ఉంటే పూర్వ కాల వైభవం వస్తుంది
ఆరోగ్యాలు కుదుట పడతాయి.
అల్లారు ముద్దుగా అన్ని విద్యలు బామ్మ వెంట అమ్మమ్మ వెంట ఉండి నేర్చుకున్నది. మనం ఆలోచిస్తే నేటి తరంలో బామ్మ అమ్మమ్మ కూడా మంచి హౌజ్ అడ్మినిస్ట్రేటర్‌లు అని చెప్పాలి. ఆ రోజుల్లోనే ప్రైవేట్‍౬గా హిందీ డిగ్రీ హిందీ పిజి చేశారు. సంగీతం వచ్చును, కుట్టు వచ్చును.
ఒక విధంగా సుప్రజ మంచి పండితురాలిగా పేరు ఉన్నది. రామాయణ భారత భాగవత అష్టాదశ పురాణాలు భగవద్గీత చక్కగా చదివింది. ఆ ఊరి పిల్లలకి బాల వికాస క్లాసులు చెపుతుంది.
వేరే వ్యక్తిత్వ వికాస క్లాసులు అవసరం లేదు. భగవద్గీత బాగా అర్థం తెలుసుకుంటే చాలు అన్ని వస్తాయి. మంచి మానవత్వం ఉండాలి అంటుంది.
లక్షలు కట్టి వ్యక్తిత్వ వికాస కోచింగ్ సెంటర్స్‌ను బాగుచేస్తున్నారు. ఇంట్లో పిల్లల్ని కూర్చో పెట్టుకుని విద్య నేర్పటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంటి పై ప్రేమ పిల్లల చదువులు స్వయంగా చూసుకోవడం అలవాటు పడ్డారు.
సరే మొత్తానికి మృదులశ్రీ చదువు డిగ్రీ ఇంటిలోనే జరిగింది. ఎక్కడ చదివిన జీవిత మార్గం మంచిగా ఉండాలి. ఇంకా పిజి కూడా ఇంటిలోనే అలవాటు పడీ ఆన్లైన్ ఉద్యోగాలు పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇంట్లో నుండే చేస్తోంది.
ఆడపిల్లకి అన్ని వచ్చి ఉండాలి అన్నది వాళ్ళ థియరీ. ఒక్కగానొక్క కూతురు కనుక దూరం బంధువులంతా ఆ పిల్లని ఎవరికి చేస్తారు అని ఆశ పడ్డారు. కానీ సుప్రజ స్నేహితురాలి కొడుకుకు పెళ్లి చేసింది. పెద్దలు అంతా హర్షించారు.
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ సన్నాయి శ్రావ్యంగా శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరస్వామి కీర్తన వినిపిస్తున్నది. ఆనందంగా డాక్టర్ శ్రీనివాస్‌తో మృదుల శ్రీ పెళ్లి అయింది.
ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ చెయ్యడం అతనికి ఇష్టం అనడం వల్ల ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అంతా సంతోషించారు.
ఈ పిల్లకి పెళ్లి ఎలా అవుతుంది? ఎలా చేస్తారు? అని బంధువులు అంతా ఒకప్పుడు విమర్శించారు. కూపస్థ మండుకంలా పెంచారు అనేవారు.
ఎక్కడికి పంపేవారు కాదు. భయం. ఆడపిల్లని ఒక్కర్తిని పంపవద్దు అని పెద్దల ఆజ్ఞ. అన్ని ఇంటిలోనే నేర్చుకున్నది. సిటీ పిల్లల కన్నా మంచి మార్కులు తెచ్చుకున్నది.
మనుష్యులు జీవితం వింతగా ఉంటుంది. పిల్లలని కని వారికి ఏ విషయమైనా జీవితం ఏర్పాటు చెయ్యక, వారి స్వార్థం కోసం పిల్లలని కనే వారు ఉన్నారు. పిల్లలను – జీవితం విలువ తెలియాలి అంటూ చిన్నతనం నుంచే పనిలో పెట్టాలని కొందరు, పనిలో విదేశీ ఉదాహరణ తెస్తూ పని నేర్చుకోమని కొందరు అంటారు.
ఆడపిల్ల అయితే చిన్నప్పటి నుంచి పెద్దల అనుకరణ తల్లి బామ్మ అమ్మమ్మ అత్త వీరి వెంట ఉంటుంది. అన్ని అవే అలవాటు అవుతాయి. కొందరు ఆడపిల్ల అక్కడి పిల్ల కనుక ఇక్కడ కష్టపడవద్దు అంటారు.
“మా పిల్లని చదివించి పెద్ద చేశాము, దానికి వంట రాదు” అని కొందరు అంటారు. మరి కొందరు “ఒక్కగానొక్క కూతురు, మేము ఏమి నేర్పలేదా అని అంటారు. కనుక అన్ని నేర్పించాలి” అని అంటారు. అది మంచిదే కదా మరి. అందుకే రక రకాల మనుష్యులతో జీవించడం కష్టం. కొందరు పిల్లలని హాస్టల్‌లో పెట్టి చదివించే పద్ధతి ఇష్టపడరు. ఎంత చదివినా పెళ్లి పిల్లలు తప్పవు అంటారు.
ఎందుకంటే ఆడపిల్లకి అన్నీ రావాలి. కానీ పెళ్లికి ముందు ఎక్కడ ఉన్నది ఏమి చేసినది అన్నది కూడా వివరాలు కావాలి. అన్నీ వచ్చిన ఆధునిక పతివ్రత కావాలి.
ఊరికే ఆడపిల్లలు కష్టపడటం ఎందుకు అని వారి అభిప్రాయము.
ఈ తరంలో ఇల్లు బాగా లేక పోయినా పిల్ల పెళ్లి కాదు. అయినా వచ్చే అల్లుడు ఇక్కడ ఉండడు కదా. అయినా సరే ఇల్లు పోష్‌గా ఉండాలి. అత్తవారి ఇల్లు ఎలా ఉన్నా ఆడపిల్ల అడ్జస్ట్ అవ్వాలి; కానీ మగ పిల్లాడు వచ్చి నాలుగు రోజులు ఉండటానికి అన్ని హంగులు ఉండాలి అంటున్నారు. ఆడ పిల్ల పెళ్లి ఏ తరం లోనైన కష్టమే అంటారు. అసలు వాళ్ళకి లేకపోయినా కొసరు వాళ్ళు ఉంటారు.
మంచి సంబంధం వచ్చిందని బంధువులు ఈర్ష్య పడ్డారు. సుప్రజ కనుక ఆ వృద్ధులనీ కూడా చూస్తోంది, భలే అల్లుడు దొరికాడు అని కొందరు తృప్తి పడ్డారు.
***
మానవ జీవితంలో ఎన్నో అవసరాలు. ప్రయాణంలో ఎన్నో పరిచయాలు, ప్రమాదాలు ప్రమోదాలు, ప్రలోభాలు. ఇలా ఎన్నో రకాల వ్యక్తుల యుక్తులు సమాహారంలో ఎన్నో విషయాలు విన్నూత్న అందాలు అంశాలు సొంతమవుతాయి.
ప్రతి నిత్యం రైలు కార్లలో ప్రయాణించే వ్యక్తుల జీవితాలు విచిత్రంగా ఉంటాయి. కానీ తప్పదు. వాళ్ళ నిరంతర ప్రయాణంలో ఎన్నో జీవిత అనుభవాలు వెన్నంటి ఎంతో బాగా తెలుస్తాయి, కలుగుతాయి.
జీవితంలో రూకలు ఎక్కడా ఉంటే నూకలు అక్కడ ఉంటాయి. ఏమి ఏ మనిషిలో సంపూర్ణ వ్యక్తిత్వం ఉండదు అని కొందరు; ఉంటారని మరి కొందరు భిన్నా అభిప్రాయాలు వ్యక్త పరుస్తారు.
ప్రతి వ్యక్తి జీవన సమరంలో సంధ్య రాగం కోసం ఎదురు చూస్తాడు. ముఖ్యంగా ఎక్కువగా ఆడపిల్లపైనే కేంద్రీకృతమై జీవితాలు గడుస్తాయి.
ఏదో రకం విమర్శలు చేయడం సహజం. లేదంటే తిన్నది అరగక అలా మాట్లాడుతూ ఉంటారు. జీవితం చాలా చిత్రమైనధి, విచిత్ర భావాల విన్యాసాల పరంపరలో గడిచి పోతుంది.
చిన్నతనంలో పెద్దల అనుభవాలు చెపుతూ ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉండండి అంటు సలహాలు సంప్రదింపులు చేస్తారు; కానీ అది పిల్లలకి నచ్చదు.
“మా చిన్నప్పుడు మేము బెల్లం ఉండలు పొలం నుంచి వచ్చినవి తిని ఆడుకునే వారము. తాటీ బెల్లం ముక్కలు కొట్టి డబ్బాలో పెట్టీ అడిగినప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు మీకు ఫైవ్ స్టార్ అంటూ వంద కాగితం ఇస్తే నాలుగు బిస్కట్లు, రెండు చాక్లెట్స్ తెస్తున్నారు. డబ్బు అంతా కిళ్ళీ కొట్లో చాక్లెట్స్‌కి కిరాణా కొట్లో, బేకరిలో బ్రేడ్ ఇతర చిరుతిళ్ళు కొనడానికి ఖర్చు పెడుతున్నారు” ఇలా తాతగారు బామ్మ గార్ల ఉపన్యాసం. అంతరాలు, మనుష్యులు మధ్య తరాల్లో మార్పు ఉన్నప్పుడు ఈ విధమైన వంకలు మాట బేధాలు గొడవలు తెస్తాయి. అటు తల్లి తండ్రి; ఇటు పిల్లల మధ్య వారధిగా మధ్య తరం బాగా విసిగి నలిగి పోతుంది.
ఇదే ఎందరికో తెలిసిన పడుతున్న సమస్య అని చెప్పాలి కానీ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. కాలంతో పాటుగా పరుగు తప్పదు. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జీవితంలో ఎన్నో మార్పులు చూపుతూ విధి చేతిలో గడిచిపోతుంది. కొందరు అందుకే పిల్లల ఇష్టానికి వదిలేస్తారు కానీ ఆడపిల్లలను ఇష్ట ప్రకారం పెంచుతారు.
మృదుల శ్రీ జీవితం పెద్దల అదుపు ఆజ్ఞలతో పెరిగి ఉన్నతిగా ఉన్నది. ఈ బాధలు పడలేక కొందరు తల్లి తండ్రిని పంచుకుంటున్నారు. కొందరు వృద్ధుల ఆశ్రమంలో పెడుతున్నారు
అయితే మృదుల శ్రీ భర్త డాక్టర్ శ్రీనివాసు కూడా తన బామ్మ తాత దగ్గర పెరగడం వల్ల; ఆ ఊరిలో హాస్పిటల్ లేదు కనుక అక్కడ తన వృత్తి కొనసాగించడానికి మంచిది అని ఆలోచించాడు. మొదటి నుంచి సిటీ జీవితం తెలుసు. అక్కడ రెండు మూడు హాస్పిటల్స్‌లో వచ్చే డబ్బు ఇక్కడ సొంత ప్రాక్టీస్‍లో రాకపోయినా; మనిషికి విలువ ఉంటుంది,
కొందరు జీవితానికి విలువ గౌరవం కోరుతారు. అందుకే మృదుల శ్రీ చాలా అదృష్టవంతురాలు అని పెద్దలు అంతా ఆనందపడ్డారు.