#ముచ్చట@కథ, స్క్రీన్ ప్లే

0
52

ముచ్చట, బహు ముచ్చటగా సాగింది. ముచ్చటలో ఎన్నెన్ని ముచ్చట్లు పాత సినిమా నుండి మొదలు కొత్త సినిమా వరకు, యూట్యూబ్ చిన్న సినిమా నుండి మొదలు తెలంగాణ సినిమా, తెలుగు సినిమా, బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమా వరకు సెమినార్ పరుగులు తీసింది.ఇంకొంత సమయం ఉండి ఉంటే విస్తృతమైన చర్చ జరిగిండునేమో. వీటంన్నిటికి మించి దాదాపుగా ఒక ఎనభై మందిని ఒక దగ్గర పోగుచేయడం గొప్ప సందర్భం, సాహసమైన విషయం కూడా.

 

  

ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమం చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు.

అల్లం రాజయ్య గారు తన ప్రసంగంలో ఎలాంటి కథను ఎంపిక చేసుకోవాలో చెప్పారు. కథ ఎక్కడో లేదు, మనలోనే ఉందన్నారు.మన కథనే మనసు పెట్టి రాసుకుంటే అద్భుతమైన కథ రెడీ అవుతుంన్నారు.

మంచి సినిమాలు తీసిన దర్శకులు ఉమామహేశ్వరరావు గారు తాన అనుభవాన్ని, తన ఆలోచనల్ని బాగా చెప్పారు.

కథకులు, విమర్శకులు కస్తూరి మురళి కృష్ణ గారు పూర్తి బాలీవుడ్ సినిమాల గురించి చాలా చక్కగా వివరించారు.

స్క్రీన్ ప్లేల రకాలు, ఎలా రాయాలి… కథకు స్క్రీన్ ప్లేకి సంబంధం ఏమిటి, మొదలగు విషయాల గురించి యువ దర్శకులు వివేక్ ఆత్రేయ, స్క్రీన్ ప్లే రైటర్ హరి గార్లు చాలా చక్కని ప్రసంగం చేసారు. ప్రతి ఒక్కరి సందేహలకు ఎంతో ఓపికతో సమాధానాలు చెప్పారు

ఎలాంటి అంశం మీదనైనా చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడగలిగే జ్ఞానం కలిగిన శ్రీ మామిడి హరికృష్ణ గారు చేసిన ప్రసంగం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ.

ఒక కాళోజీ నారాయణరావు గారిని ఒక గొప్ప కవిగా పరిచయం చేసే సన్నివేశం స్క్రీన్ ప్లే ద్వారా చెప్పిన విధానం సెమినార్‌లో చప్పట్ల వర్షం కురిపించింది.

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమ్రన్ ప్రయాణం గురించి మరియు స్వాతిముత్యం మొదటి సీనే సినిమా మొత్తం కథను చెబుతుందన్న లాజిక్‌ను భలే చెప్పారు..

యువ దర్శక, రచయితల్ని తయారు చేసే గొప్ప కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని, విజయవంతం చేసిన హరికృష్ణ సార్‌కి ప్రత్యేక వందనాలు.

ఎన్నో విషయాలు చెప్పిన వక్తలకు కృతజ్ఞతలు.

తన వ్యాఖ్యానం, గొప్ప మాటలు ఉదాహరణలతో సభను సభను నడిపిన అయినంపూడి శ్రీ లక్ష్మీ మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here