ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 11

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

భోః శ్రేష్ఠిన్ చన్దన దాస! అపి ప్రచీయన్తే సంవ్యవహారాణాం వృద్ధిలాభాః?

అర్థం:

భోః+శ్రేష్ఠిన్+చన్దన దాస!= అయ్యా, చందనదాస శెట్టి గారూ, సంవ్యవహారాణాం=వ్యాపార లావాదేవీలలో, వృద్ధి+లాభాః=అభివృద్ధి, లాభాలు, అపి+ ప్రచీయన్తే?= బాగా నడుస్తున్నాయా?

చన్దన దాసః:

(స్వగతమ్) అచ్చాదరో సంకణీఓ, (ప్రకాశమ్) అహ కిం। అజ్జస్స ప్పసాఏణ అఖణ్డిదా మే వాణిజ్య, [అత్యాదరః శఙ్కనీయః. (ప్రకాశమ్) అథకిమ్, ఆర్యస్య ప్రసాదేన అఖణ్డితా మే వాణిజ్యా.]

అర్థం:

(స్వగతమ్=తనలో), అత్యాదరః+శఙ్కనీయః= ఈ ఎక్కువ ఆప్యాయత అనుమానించగదినది, (ప్రకాశమ్=పైకి), అథకిమ్=అవును, ఆర్యస్య+ప్రసాదేన=అయ్యవారి దయవల్ల, మే+వాణిజ్యా+అఖణ్డితా=నా వ్యాపారం నిర్విఘ్నంగా సాగుతోంది.

చాణక్యః:

న ఖలు చన్ద్రగుప్తదోషా అతిక్రాన్త పార్థి వగుణా నధునా స్మారయన్తి ప్రకృతీః।

అర్థం:

అధునా=ఇప్పుడు, ప్రకృతీః=ప్రజలు, చన్ద్రగుప్తదోషాః=చంద్రగుప్తుడి తప్పిదాలు (లను), అతిక్రాన్త+పార్థివగుణాన్=కడచిపోయిన పాలకుల గుణాలను, న+స్మారయన్తి+ఖలు=తలచుకోవడం లేదు కదా!

చన్దన దాసః:

(కర్ణౌపిధాయ) సన్తం పావమ్। సార అణిసా సముగ్గఏణ విఅ పుణ్ణిమాచన్దేణ చన్దసిరిణా ఆహిఅం ణన్దన్తి పకిదిఓ. (శాన్తమ్ పాపమ్. శారదనిశా సముద్గతే నేవ పూర్ణిమాచన్ద్రేణ చన్ద్రశ్రి యాధికం నన్దన్తి ప్రకృతయః)

అర్థం:

(కర్ణౌపిధాయ=చెవులు మూసుకుని), శాన్తమ్+పాపమ్=పాపము శమించుగాక!, శారదనిశా+సముద్గతేన+ఇవ=శరత్కాల రాత్రి ఉదయించిన (పైకి వచ్చిన), పూర్ణిమాచన్ద్రేణ=పూర్ణచంద్రుని మాదిరి, చన్ద్రశ్రియం=చంద్రగుప్త వైభవాన్ని, అధికం=మిక్కిలిగా, ప్రకృతయః= ప్రజలు, నన్దన్తి=ప్రశంసిస్తున్నారు.

చాణక్యః:

భోః శ్రేష్ఠిన్, యద్యేవం, ప్రీతాభ్యః ప్రకృతిభ్యః ప్రతి ప్రియ మిచ్ఛన్తి రాజానః

అర్థం:

భోః+శ్రేష్ఠిన్=అయ్యా శెట్టిగారూ, యది+ఏవం=అలాగయ్యే మాటుంటే, ప్రీతాభ్యః+ప్రకృతిభ్యః=సంతోషించే ప్రజల నుంచి (వలన), రాజానః=రాజులు (పాలకులు), ప్రతిప్రియం+ఇచ్ఛన్తి=తిరిగి ఆదరాన్ని ఆశిస్తారు (ఆశిస్తూంటారు).

చన్దన దాసః:

ఆణవేదు అజ్జో, కిం కిత్తిఅం ఇమాదోజణాదో ఇచ్ఛీయదిత్తి. (ఆజ్ఞాపయతు ఆర్యః కిం కియ దస్మాజ్జనా దిష్యతఇతి।)

అర్థం:

ఆర్యః=అయ్యవారు, అస్మాజ్జనాత్ (అస్మత్+జనాత్)=వీడి నుంచి (ఈ, నా నుంచి), కిమ్+కియత్=ఏమి ఎంత, ఇష్యతే+ఇతి=కోరుతున్నారనేది, ఆజ్ఞాపయతు=ఆనతినివ్వండి.

చాణక్యః:

భోః శ్రేష్ఠిన్ చన్ద్రగుప్తరాజ్య మిదం। న నన్ద రాజ్యమ్। యతో నన్ద స్యై వార్థ రుచే రర్థ సమ్బన్ధః  ప్రీతి ముత్పాదయతి, చన్ద్రగుప్తస్య తు భవతా మపరిక్లేశ ఏవ॥

అర్థం:

భోః+శ్రేష్ఠిన్=అయ్యా శెట్టిగారూ, ఇదం+చన్ద్రగుప్తరాజ్యం=ఇది చంద్రగుప్తుడి రాజ్యం, న+నన్దరాజ్యమ్= నందరాజులది కాదు, యతః=ఎందుకంటే, అర్థరుచేః+నన్దస్య+ఇవ=డబ్బు రుచి మరిగిన నందుని మాదిరిగా, అర్థ+సమ్బన్ధః=ధన సంబంధం, ప్రీతి+న+ఉత్పాదయతి=ఇష్టాన్ని కలిగించదు, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుడికి, భవతాం+అపరిక్లేశః+ఏవ=మీరు (మీ యొక్క), హింస లేకుండా ఉండడమే (హింసపడకుండా ఉండడమే), (ప్రీతిం+ఉత్పాదయతి=)ఇష్టంగా ఉంటుంది (ఇష్టం కలిగిస్తుంది).

వ్యాఖ్య:

ఇక్కడ “పరిక్లేశః” అనే పదానికి వట్టినే శ్రమ అనే అర్థం కాదు. “హింస” అని అర్థం.

సాయపడకపోతే, ఎదురయే హింస – అని హెచ్చరిక.

దండనీతి శాస్త్రంలో –

వధోఽర్థగ్రహనం చైవ పరిక్లేశ స్తథైవచ

ఇతి దణ్డవిధానజ్ఞైర్దణ్డోఽపి త్రివిధః స్మృతః॥

అని – వివరణ.

చన్దన దాసః:

(సహర్షమ్) అజ్జ, అణుగ్గహీదోహ్మి, (ఆర్య, అనుగృహీతోఽస్మి).

అర్థం:

(సహర్షమ్=ఆనందంగా), ఆర్య=అయ్యవారూ, అనుగృహీతః+అస్మి=తమ దయకు కృతజ్ఞుడిని.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here