Site icon Sanchika

ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 7

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చరః:

సుణాదు అజ్జో, అత్థి దావ అహం అజ్జేణ పౌరజణ చరిద అణ్ణేసణే ణిఉత్తో, పరఘరప్పవేసే పరస్స అణాసంకణిజ్జేణ ఇమిణా జమపడేణ హీణ్డన్తో, మణిఆర సెట్ఠి చన్దణదాసస గేహం పవిట్ఠోహ్మి, తహిం జమపడం పసారీఅ పఉత్తోహ్మి గీతాఇం గాఇదుమ్.

(శృణో త్వార్యః। అస్తి తావ దహ మార్యేణ పౌరజన చరితాన్వేషణే నియుక్తః। పరగృహప్రవేశే పర స్యానాశఙ్కనీయేన అనేన యమపటేన అహిన్డమానో మణికార శ్రేష్ఠి చన్దనదాసస్య గృహం ప్రవిష్టోఽస్మితత్ర యమపటం ప్రసార్య ప్రవృత్తోఽస్మి గీతాని గాతుమ్)

అర్థం:

ఆర్యః+శ్రుణోతు=అయ్యా, వినండి (విందురు గాక!), అస్తితావత్+అహం=అప్పుడా విధంగా  నేను, ఆర్యేణ=అయ్యగారి ఆజ్ఞ మేరకు, పౌరజన+చరిత+అన్వేషణే=పురజనుల నడవడులు కనిపెట్టే పనిలో, నియుక్తః=నియమింపబడ్డాను (తమ చేత), పరగృహ+ప్రవేశే=ఇతరుల ఇళ్ళ లోకి ప్రవేశించడానికి (ప్రవేశించడంలో), పరస్య+అనాశఙ్కనీయేన=ఇతరులకి అనుమానం కలగని విధంగా, అనేన+యమపటేన=ఈ యమపటంతో, ఆహిన్డమానః=సంచారం చేస్తూ చేస్తూ, మణికారశ్రేష్ఠి+చందనదాసస్య+గృహం=రత్నాల వర్తకుడు చందనదాసు ఇల్లు (ఇంటిని), ప్రవిష్టః+అస్మి=చేరుకున్నాను (వారింట్లో ప్రవేశించాను), తత్ర=అక్కడ, యమపటం+ప్రసార్య=యమపటం పరిచి, గీతాని+గాతుమ్=పాటలు పాడుతూ, ప్రవృత్తః+అస్మి=కూర్చున్నాను (పని ప్రారంభించాను).

చాణక్యః:

తతః కిమ్? 

అర్థం:

తతః=అప్పుడు (ఆ మీదట), కిమ్=ఏమి సమాచారం?

చరః:

తదో ఎక్కాదో అవవరకాదో పఞ్చ వరిసదేసేఓ పిఅదంసణీఅ సరీరాకిదీ కుమారఓ బాలత్తణ నులహ కోదూహ లోప్పుల్ల ణఅణో ణిక్కమిదుం పఉత్తో। తదో హా ణిగ్గదో హా ణిగ్గదో త్తి సంకాపరిగ్గహణివేద ఇత్తిఓ తస్స ఎవ్వ అవవర కస్స అబ్భస్తరే ఇత్థియాజణస్స ఉట్ఠిదో మహన్తో కలఅలో, తదో ఈసి దారదేశదావిదముహీఏ ఎక్కాఏ ఇత్థిఆఏ సో కుమారఓ ణిక్కమన్త ఎవ్వ ణిబ్భచ్చి అవలమ్బీతో కోమలాఏ బాహులదాఏ। తస్సాఏ కుమార సంరోధసంభమప్ప చలిదఙ్గులిదో కరాదో పురినఅఙ్గుళి పరిణాహ ప్పమాణ ఘడిఆ విఅలిఆ ఇఅం అఙ్గుళిముద్దియా దేహళీ బన్దమ్మి పడియా ఉట్టిదా తాఏ అణవబుద్ధా ఎవ్వ మమ చలణపాసం సమాగచ్ఛిఅ పణామణిహు కులవహుఆ విఅ ణిచ్చలా సంవుత్తా। మఏ వి అమచ్చరక్ఖసస్స ణామంకిదేత్తి అజ్జసస్స పాదమూలం పావిదా తా ఏసో ఇమాఏ ఆఅమో।

(తత శ్చ ఏక స్మా దపవరకాత్ పఞ్చవర్షదేశీయః ప్రియ దర్శనీయశరీరాకృతిః కుమారకో బాలత్వసులభకౌతూహలోత్ఫుల్ల నయనో నిష్క్రమితుం ప్రవృత్తి తతో హా! నిర్గతో, హా! నిర్గతఇతిశఙ్కాపరిగ్రహ నివేదయితా తస్యై వాపవరక స్యాభ్య న్తరే స్త్రీజన స్యోత్థితో మహాన్ కలకలః। తత ఈషద్ధ్వార దేశదాపిత ముఖ్యా ఏకయా స్త్రియా స కుమారకో నిష్క్రామ న్నేవ నిర్భ ర్త్స్యా వలమ్బితః కోమలయా బాహులయా। తస్యాః కుమార సంరోధసంభ్రమ ప్రచలితాఙ్గులేః కరాత్ పురుషాఙ్గుళి పరిణాహ ప్రమాణ ఘటితా విగళి తేయ మంగుళిముద్రికా దేహళీబన్దే పతితా ఉత్థితా తయా అనవబు ద్ధైవ మమ చరణపార్శ్వం సమాగత్య ప్రణామనిభృతా కులవధూ రివ నిశ్చలా సంవృత్తా, మ యాపి అమాత్యరాక్షసస్య నామాఙ్కి తేతి ఆర్యస్య పాదమూలం ప్రాపితా తస్మా దేషోఽస్యా ఆగమః)

అర్థం:

తతః+చ=అప్పుడేమో, ఏకస్మాత్+అవవరకాత్=ఆ యింటిలోని ఒక గదిలోనుంచి, పఞ్చవర్షదేశీయః=అయిదేళ్ళ ప్రాయం వున్న, ప్రియదర్శినీశరీరాకృతి=చూడచక్కని రూపంగల, కుమారకః=చిన్నపిల్లవాడు, బాలత్వ+సులభ+కౌతుహలః=చిన్నపిల్లలకు సహజంగా వుండే కుతూహలంతో, ఉత్ఫుల్లినయనః=విప్పార్చిన కళ్ళవాడు, నిష్క్రమితుం+ప్రవృత్తః=బయటకు రావడానికి (వెళ్ళడానికి) సిద్ధపడ్డాడు. తతః=అంతలో, హా+నిర్గతః+హా+నిర్గతః=అరరే! బయటకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, ఇతి=అని, శఙ్కాపరిగ్రహ+నివేదయితా=అనుమానాన్ని (ఆందోళనతో) తెలియజేస్తున్న, అపవరకస్య+అభ్యంతరే=గదిలోపల (ఉన్న), స్త్రి జనస్య=ఆడువారి, మహాన్+కలకలః=గొప్ప అలజడి(ఏర్పడింది). తతః= ఆ మీదట, ఈషత్+ద్వారదేశ+దాపితముఖ్యా+ఏకయా+స్త్రియా=వీధివాకిలికి కొంచెం చాటుగా ముఖం చూపిస్తూ ఒక స్త్రీ (చేత), సః+కుమారకః= ఆ కుర్రవాడిని (కుర్రవాడు), నిష్క్రామున్+ఏవ=చెయ్యిదాటిపోతూ ఉండగానే (వెళుతూ ఉండగానే), నిర్భర్త్స్య=కసిరి (కసరబడి), కోమలయా+బాహులతయా=సున్నితమైన చేతితో, అవలంబితః=దొరకపుచ్చుకున్నది (పట్టుకొనబడ్డాడు) – (అంటే; పరుగెత్తి పోతున్నవాడిని ఒక చెయ్యి ఆపి పట్టుకున్నది),  తస్యాః+కుమార+సంరోధ+సంభ్రమ+ప్రచలితేః+అఞ్గులేః=పిల్లవాడిని పట్టుకునే తొందరలో వేగంగా కదిలే ఆమె చేతి వ్రేలి నుంచి, పురుష+అఞ్గుళి పరిణాహ ప్రమాణ ఘటితా=మగవాడి వ్రేలి పరిమాణం కలిగిన, ఇయం+అఞ్గుళి+ముద్రికా=ఈ అంగుళీయకం (ఉంగరం), విగళితాం=జారిపోయి, తత్+దేహళీబంధే+పతితా=ఆ వాకిలి గడపలో పడి, ఉత్థిత్తా=ఎగిరి, తయా+న+అవబుద్ధా+ఏవ=ఆమెకు (ఆమె చేత) తెలియకుండానే, మమ+చరణపార్శ్వం+సమాగత్వ=నా కాలి పక్కకు వచ్చి, ప్రణామ+నిభృతా=నమస్కరించడం కోసం వంగిన, కులవధూః+ఇవ=ఇల్లాలు మాదిరిగా, నిశ్చలా+సంవృత్తా=కదలక మెదలక ఉండిపోయింది. అమాత్యరాక్షసస్య+నామాఙ్కితా+ఇతి=రాక్షసమంత్రి పేరు (దానిపై) ఉంది కదా అని, మయా+అపి=నేను కూడా (నా చేత), ఆర్యస్య+పాదమూలం=(ఇదిగో) అయ్యగారి పాదాల దగ్గర, ప్రాపితా=ఉంచాను (ఉంచబడింది). తస్మాత్+ఏషః+అస్యాః (అఞ్గులికాయాః) ఆగమః= ఇదే ఈ ఉంగరం దక్కిన కథ.

చాణక్యః:

భద్ర, శ్రుతమ్! అపసర, ఆచిరా దస్య పరిశ్రమస్య అనురూపం ఫల మధిగమిష్యసి

అర్థం:

భద్ర=నాయనా, శ్రుతం=విన్నాను (వినబడింది), అపసర=ఇక వెళ్ళు (తొలగిపో), అస్య+ప్రరిశ్రమస్య=ఈ పనికి, అబిరాత్=త్వరలోనే, అనురూపం+ఫలం=తగిన ప్రతిఫలాన్ని, అధిగమిష్యసి=పొందగలవు (నీకు ముట్టగలదు)

చరః:

జం అజ్జో ఆణవేదిత్తి (యదార్య అజ్ఞాపయతి)

(నిష్క్రాన్తః)

అర్థం:

యత్+ఆర్యః+ఆజ్ఞపయతి=తమరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. (నిష్క్రాన్తః=వెళ్ళాడు).

చాణక్యః:

శార్ఙ్గరవ! శార్ఙ్గరవ!

అర్థం:

ఓ – శారంగరవ! శారంగరవ!

శిష్యః:

(ప్రవిశ్య) ఆజ్ఞాపయ

అర్థం:

(ప్రవిశ్య = వచ్చి), ఆజ్ఞాపయ = ఆదేశించండి.

చాణక్యః:

వత్స, మషీ భాజనం, పత్త్రం చోపనయ.

అర్థం:

వత్స=అబ్బాయీ, మషీభాజనం+పత్త్రం+చ= సిరాబుడ్డినీ, వ్రాతపత్త్రాన్నీ కూడా, ఉపనయ=తీసుకొని రా!

(శిష్యః తథా కరోతి)

(శిష్యః=శిష్యుడు, తథా+కరోతి=అలాగే చేస్తాడు)

చాణక్యః:

(పత్రం గృహీత్వా స్వగతమ్) కి మత్ర లిఖామి? అనేన ఖలు లేఖేన రాక్షసో జేతవ్యః

అర్థం:

(పత్రం గృహీత్వ=పత్రం తీసుకుని, స్వగతమ్=తనలో), అత్ర+కిమ్+లిఖామి=ఇక్కడ ఏమి వ్రాయను?, అనేన+లేఖేన+ఖలు=ఈ ఉత్తరంతోనే, రాక్షసః+జేతవ్యః=రాక్షసమంత్రిని జయించాలి (రాక్షసమంత్రి జయింపబడాలి)

ప్రతీహారీ:

(ప్రవిశ్య) జేతు అజ్జో (జయత్వార్యః)

అర్థం:

ఆర్యః=అయ్యగారికి, జయతు=జయమగుగాక!

చాణక్యః:

(సహర్షమ్, ఆత్మగతమ్) గృహీతో జయశబ్దః (ప్రకాశమ్) శోణోత్తరే, కి మాగమన ప్రయోజనమ్?

అర్థం:

(సహర్షమ్=సంతోషంగా, ఆత్మగతమ్=తనలో) జయశబ్దః+గృహీతః=జయపదాన్ని స్వీకరించాం. (ప్రకాశమ్=పైకి), శోణోత్తరే!=శోణోత్తరా! (ఎఱ్ఱమ్మా!), ఆగమన+ప్రయోజనం+కిమ్= (నీ) రాకకు కారణం ఏమిటి? (ఏమిటి విశేషం?)

ప్రతీ:

అజ్జ, దేవో చన్దసిరి సీసే కమలము ఉళాఆర మఙ్జిలిం ణివేసిఅ ఆజ్జం విణ్ణవేది “ఇచ్ఛామి ఆజ్జేణ అభ్యణుణ్ణాదో దేవస్స పవ్వదీసరస్స పారలోఇఆం కారేదుమ్ – తేణ అ ధారితపువ్వా ఈ ఆహరణా ఈ బహ్మణాణం పడివాదిమిత్తి”।

(ఆర్య, దేవశ్చన్ద్రశ్రీః  శీర్షే కమలముకుళాకార మఙ్జలిం నివేశ్య ఆర్యం విజ్ఞాపయతి-“ఇచ్ఛామి ఆర్యే ణానుజ్ఞాతో దేవస్య పర్వతేశ్వరస్య పారలౌకికం కర్తుమ్. తేన చ ధారితపూర్వాణి ఆభరణాని బ్రాహ్మణానాం ప్రతిపాదయామీతి”)

వ్యాఖ్య:

చాణక్యుడు ఆ ఉంగరం ఆధారంగా రాక్షసమంత్రిని ఎలాగ లొంగదీయాలో అని ఆలోచిస్తుండగా, ప్రతీహారి (ద్వారపాలిక) కొత్త వార్తతో వచ్చింది. ఆ వార్త చాణక్యుడి మంత్రాంగానికి ఒక కొస అందించినట్లైంది. చంద్రగుప్తుడు, విషకన్యాప్రయోగం వల్ల మరణించిన పర్వతేశ్వరుడికి అంత్యక్రియలు నిర్వహింపజేసి, “ఆ ప్రభువునకు చెందిన ఆభరణాలను బ్రాహ్మణులకు దానం చేయాలని ప్రతిపాదిస్తున్నాను” – అంటున్నాడు.

అర్థం:

ఆర్య=అయ్యగారూ, దేవః+చంద్రశ్రీః=చంద్రగుప్త దేవరవారు, శీర్షే=తలపై, కమలముకుళ+ఆలారం=తామరమొగ్గ ఆకారం గల, అంజలిం+నివేశ్య= దోసిలి ఒగ్గి, ఆర్య+విజ్ఞాపయతి=తమకు విన్నవిస్తున్నారు. (యతః=ఏమనంటే) – “ఆర్యేణ+అనుజ్ఞాతః=అయ్యగారి అనుమతితో (పొంది), దేవస్య+పర్వతేశ్వరస్య=పర్వతేశ్వర ప్రభువు యొక్క, పారలౌకికం+కర్తుమ్=అంత్యక్రియలు చేయడానికి, ఇచ్ఛామి=అనుకుంటున్నాను, తేన+వ+ధారితపూర్వాణి+ఆభరణాని=అతడు పూర్వం ధరించిన (అతనిచే ధరింపబడిన) నగలను (అలంకారాలను), బ్రాహ్మణానామ్=బ్రాహ్మణులకు (ఇవ్వలని), ప్రతిపాదయామి=సూచిస్తున్నాను.” ఇతి=అని.

చాణక్యః:

(సహర్ష మాత్మగతమ్.) సాధు వృషల, మ మైవ హృదయేన సహ సంమన్త్ర్య సన్దిష్టవా నసి (ప్రకాశమ్) శోణోత్తరే, ఉచ్యతా మస్మద్వచనా ద్వృషలః। సాధు వత్స, అభిజ్ఞః ఖ ల్వసి, లోక వ్యవహారాణామ్। తదనుష్ఠీయతా మాత్మనోఽభిప్రాయః। కింతు, పర్వతేశ్వరేణ ధృతపూర్వాణి గుణవన్తి భూషణాని గుణవద్భ్య ఏవ ప్రతిపాదనీయాని। త దహం స్వయ మేవ పరీక్షితగుణాన్ బ్రాహ్మణాన్ ప్రేషయామి॥

అర్థం:

(సహర్షమ్=సంతోషంగా, ఆత్మగతమ్=తనలో), వృషల=చంద్రగుప్తా! సాధు=చాలా బాగుందయ్యా! మమ+ఏవ+హృదయేన+సహ=నా మనసుతో పాటే, సం మంత్ర్య=ఆలోచన చేసి, సందిష్టవాన్+అసి=కబురు పంపించిన వాడివయ్యావు! (ప్రకాశమ్=పైకి), శోణోత్తరే=అమ్మాయీ శోణోత్తరా! అస్మత్+వచనాత్=నా మాటగా (కూడా), వృషలః+ఉచ్యతామ్=చంద్రగుప్తుడికి చెప్పు (చెప్పబడుగాక!) – “వత్స=నాయనా!, సాధు=చాలా బాగుందయ్యా, లోకవ్యవహారాణామ్+అభిజ్ఞః+అసి+ఖలు=ప్రపంచ విషయాలలో బుద్ధిశాలివి కద!, తత్+ఆత్మనః+అభిప్రాయః+అనుష్ఠీయతౌ=అందువల్ల నీ అభిప్రాయం ప్రకారమే చెయ్యి (చెయ్యబడుగాక), కిం+తు= కాని, పర్వతేశ్వరేణ+ధృతపూర్వాణి+గుణవన్తి+భూషణాని=పర్వతేశ్వరుడు పూర్వం ధరించిన మేలైన ఆభరణాలను (ఆభరణాలు), గుణవద్భ్యః+ఏవ=సద్గుణవంతులకే, ప్రతిపాదయితాని=ఇవ్వదగినవి, తత్=అందువల్ల, అహం+స్వయం+ఏవ=నేనే స్వయంగా, పరీక్షతగుణాన్+బ్రాహ్మణాన్=మేలైన గుణవంతులైన బ్రాహ్మణుల్ని ఎంపిక చేసి, ప్రేషయామి=పంపిస్తాను.

ప్రతీ:

జం అజ్జో ఆణవేదిత్తి [యదార్య ఆజ్ఞాపయతి.]

(నిష్క్రాన్తా)

అర్థం:

ఆర్యః+యత్+ఆజ్ఞాపయతి=తమ ఆజ్ఞ (విన్నవిస్తాను)

(నిష్క్రాన్తా=వెళ్ళింది)

(సశేషం)

Exit mobile version