[dropcap]డా. [/dropcap]వి. చంద్రశేఖర రావు రచించిన ఏడు కథల సంపుటం “ముగింపుకు ముందు.
ఈ కథల సంకలనాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ఆయన మరణానంతరం పుస్తక రూపంలో ప్రచురించారు.
పుస్తకానికి ముందుమాట “కలల రంగులు తెలిసిన కథకుడు”లో బి. తిరుపతిరావు ‘కథారచనలో చంద్రశేఖరరావు తెలుగు పాఠకలోకానికి ఒక కొత్త రచనా పద్ధతిని పరిచయం చేశాడ’న్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘వాస్తవికతను దాన్ని పై పొరల్లోంచి కాకుండా దానిపైన ఉన్న మార్మికతను తొలగిస్తూ లోపలిపొరల్లోని అంశాల్ని చూపించటానికి తను ప్రయత్నం చేశాడ’ని రాశారు. ‘పాత్రలు అచేతన ప్రపంచంలోని భావాల్ని, అభిప్రాయాల్ని వాటి ప్రవర్తన ద్వారాకాక తమకు తాముగా చెప్పే క్రమాన్ని చంద్రశేఖరరావు పరిచయం చేశాడనీ, చంద్రశేఖర రావు ఎక్కువగా fractured writing తరహా కథలు రచించారడనీ, చంద్రశేఖర రావు శైలిలో తర్కానికి ఆస్కారం తక్కువ. అనుభవాలు భావుకత కలసి వాక్యాలుగా స్థిరపడతాయి. ఒక వాక్యానికి రెండవ వాక్యానికి మధ్య తార్కిక సంబంధం బలహీనంగా ఉండి కథ శకలాలు శకలాలుగా మిగులుతుంద’ని fractured writing ను వివరించారు.
ఈ సంపుటంలో పూర్ణమాణిక్యం ప్రేమ కథలు, హిట్లర్ జ్ఞాపకాలు, సూర్యుని నలుపు రంగు రెక్కలు, కొయ్య గుర్రాలు, నేను, పి.వి.శివం, బ్లాక్ స్పైరల్ నోట్ బుక్, ముగింపుకు ముందు అనే ఏడు కథలున్నాయి.
***
ముగింపుకు ముందు (కథలు)
రచన: డా. వి. చంద్రశేఖర రావు
పేజీలు: 132
వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు