[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 19.07.2018 నాడు శ్రీ లలితా పీఠంలో “ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు” అనే అంశంపై శ్రీమాన్ టి.పి.ఎన్.ఆచార్యులుగారి ప్రసంగ కార్యక్రమం జరిగింది.
డా.కోలవెన్ను మలయవాసినిగారు అధ్యక్షోపన్యాసంలో, ‘పారిజాతాపహరణం’ ప్రాముఖ్యత, పద్యాల విశిష్టత తెలియజేశారు. ప్రముఖ సాహితీ విమర్శకులు డా. డి.వి.సూర్యారావుగారు తమ స్పందన తెలియజేశారు.
విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం వందన సమర్పణ చేశారు.