[dropcap]అ[/dropcap]బ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇటీవల “పదచదరాలు” పేరుతో పాతిక మంది కూర్పరులతో పాతిక గళ్ళనుడికట్లను తయారు చేయించి పుస్తకంగా ప్రచురించింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంవల్ల లభించిన ఉత్సాహంతో మరో ప్రయోగాన్ని తలపెడుతోంది.
ఈసారి వంద మంది పద్యకవులతో ఒక ముక్తపదగ్రస్త పద్యకావ్యాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నది. అంటే ఒక కవి వ్రాసిన పద్యం చివరి పదంతో మొదలు పెట్టి మరో కవి తన పద్యాన్ని రచించాలన్నమాట. ఈ విధంగా గొలుసుకట్టు పద్యాలతో ఒక అద్భుత కావ్యాన్ని రూపొందించాలి.
ఈ బృహత్ప్రయత్నంలో పాల్గొన వలసిందిగా పద్యకవులందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాజెక్టులో పాల్గొన దలచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మీ పేరు (కలం పేరు, అసలు పేరు విడివిడిగా), చిరునామా, వాట్స్ ఆప్ ఫోన్ నెంబరు, ఇ-మెయిల్ ఐ.డి. మొదలైన వివరాలతోపాటు మీగురించి ఒక పద్యం వ్రాసి muktapadagrastam@gmail.com కు మెయిల్ చేయాలి.
వందమంది కవులు నమోదు చేసుకున్న తర్వాత వారికి కావ్య వస్తువు, కావ్య ప్రణాళిక ఇతర నియమ నిబంధనలు తెలియజేస్తాము. ఈ ప్రాజెక్టులో నమోదు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. మరియు పాల్గొన్నవారికి ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు.