Site icon Sanchika

మురళీ

[dropcap]దూ[/dropcap]రాన కోయిలొక్కటి
‘కూఁ… కుహూ’ యన్నది.
మది లోన కోరికొక్కటి
‘ఓ… ఒహో’ యన్నది.
గోపాలుని చిరుపెదవుల
సుతిమెత్తని శయ్యపై
వేణువునై నే పరుండి,
లోకాల నుర్రూతలూపాలని
ఏమి పుణ్యము చేసితివో మురళీ!

నీదు భాగ్యమె భాగ్యము
సత్యాపతి పట్టపురాణికిని,
సత్రాజిత్తుని గారాలపట్టికిని,
అష్టభార్య లెవ్వరికినీ, మాధవుని
యదలో తిష్ట వేసిన రాధకైన
పట్టని అదృష్టమే నీదయ్యనే!
మురారి మోవిపై పవ్వళించి,
ముగ్ధమనోహరముగా రవ్వళించి.
ముజ్జగాలనే ఊయల లూపేవు.
మురళీ! నీదు భాగ్యమె – భాగ్యము.

Exit mobile version