ముసుగోపాఖ్యానం

1
2

[dropcap]కాం[/dropcap]స్యపు లోహముతో చేసి,
దాబు దర్పం కలగలసి,
నడిచే దారినీ ఆక్రమించి..!

ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్టించిన,
ఎన్నో విగ్రహాలకు తొడిగే,
తాత్కాలిక ముసుగు..
ఓ మహా నాటకం!!

పేరుకేమో ఎన్నికల నియమావళి,
అడుగడుగునా ఉల్లంఘనతో,
అదో హాస్య ముక్తావళి!!

బ్రతికిఉన్న నాయకులు
చేసే విన్యాసాలకు..
ప్రాణంలేని విగ్రహాన్ని
సాకుగా చూపే పరిణామం,
అర్థం లేని వ్యవహారం!!

విగ్రహాల ముంగిటే,
పారే ధన ప్రవాహం,
విచిత్ర నియమావళిని-
ఎద్దేవా చేసి నవ్వుతోంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here