Site icon Sanchika

ముసుగు..!!

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘’ముసుగు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


[dropcap]ఆ[/dropcap]మె మౌనాన్నీ
ఆడిపోసుకుంటారు
అక్కుడున్నవాళ్ళందరూ!
అతనిముందు –
మౌనానికి కారణం..
ఆమెకు, అతనికే తప్ప
మూడో మనిషి —
అన్నవాళ్ళెవరికీ తెలీదు..!
చూడ్డానికి.. ఆమె
అసంకల్పిత మూగనోము,
గర్విష్టిగా ముద్రవేస్తుంది!
కానీ..
ఆమె మూగతనానికి కారణం
అతడి అర్థంపర్థం లేని,
అసందర్భ వ్యాఖ్యానాలని ,
తద్వారా.. ఆమె
మౌనానికి కారణం,
గొంతును నొక్కిపట్టివుంచే
గుండెవేదనే కారణమని..
అది రాక్షస సహచరుడు
సృష్టించే —
నరకయాతన ఫలితమని,
ఎంతమందికి తెలుసు?
ఆ మౌనానికి వెనుక ఉన్న
దౌర్బగ్యపు ‘ముసుగు’ లోని
కిరాతక మర్మ సూత్రం..!!

Exit mobile version