Site icon Sanchika

ముసురు

[dropcap]ము[/dropcap]సిరిన చీకట్లలో
ముసురు కురుస్తుంది
ఎడతెరిపి లేకుండా
కొనసాగుతున్న వయోవృధ్ధ శ్వాసలా…
గాలి వీస్తున్నది
విసురుగా తుంపర నీట తడిసి
అదే పనిగా గెరువు లేక
చెరువు కట్టపై ఊగే తుమ్మ కొమ్మల
ఊపిరిగా….
నడకలో నడక కలిపి
నడుస్తున్నది ఇచ్ఛగా
చీకటి జండా ఝంఝలో
మిణుగురు పురుగుల ఎద సొద
సాయం సంధ్య వాలిన పొద్దు
విరామ వినోద గీతంలా…
బాల్యమై గంతులేసింది
శల్య కుటీరం మెట్లపై
కొనసాగే చిన్నతనం మొస మొనల్లో
మిణుగురు పురుగుల ఎద సొద
సాయం సంధ్య వాలిన పొద్దు
విరామ వినోద గీతంలా…
బాల్యమై గంతులేసింది
శల్య కుటీరం మెట్లపై
కొనసాగే చిన్నతనం మొస మొనల్లో
అన్నీ దృష్యించిన వయోవృధ్ధం
స్వప్నించిన సత్య సందేశం
ముసురైనా విసురైనా కసురైనా
సుఖ గాయాల ప్రాయం గేయాలే
ముదిమి నడక పడకేసినా జీవమే
రుచి చూసిన బతుకంతా గొప్పదే
బాల్యం నుండి వృధ్ధానుభవసారం
ఓ మహా వేదం
ముసురు తడిలేక మొలక నేలఏది?
నిజ జీవన ప్రకృతి ఆకృతిలో
ముసురూ గొప్ప కావ్య లహరే మరి..

Exit mobile version