[dropcap]మా [/dropcap]ఊరినుంచే
నేను కలలు కనడం మొదలుపెట్టాను
నా కలలు చాల చిన్నవనుకున్నాను
నా కలలను సాధించడం
చాల సులభమనుకున్నాను
ఎక్కడో కనిపించనంత దూరంగా వున్న
లక్ష్యం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను
జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవడం కోసం
రాత్రి, పగళ్ళు తేడా లేకుండా సాధన చేశాను
రోజులు గడుస్తూనే వున్నాయ్
నా కల
రోజురోజుకీ
కరుగుతూ
తరుగుతూనే ఉంది
కానీ
నా జీవితంలోకి రావడంలేదు
నేను ఎంత ప్రయత్నిస్తూనే ఉన్నా
నా నుంచి జారిపోతూనేవుంది
దూరంగా పారిపోతూనేవుంది
నేను మాత్రం
దాని వెనుకనే పరుగులు తీస్తూనే వున్నాను
నా మనసుకు అలసట రాలేదు
కానీ
కాలానికి అలుపొచ్చేసింది
ఆగిపోయింది
నన్ను ఆపేసింది
నా కల
చాలా దూరంలోనే ఉండి పోయింది
నా కల చివరకు
నా జీవితంలో
నెరవేరని కల గానే మిగిలిపోయింది.