నా రమణి

0
1

[box type=’note’ fontsize=’16’] తాను వలచిన ఇంతిని పెళ్ళాడలన్న తపనతో తనని తాను వ్యక్తం చేసుకుంటున్న ఓ భావుకుడి కథ “నా రమణి“. రచయిత గొర్లె రమేష్. [/box]

[dropcap]చై[/dropcap]త్యన్య మొదటిసారిగా రమణిని చూశాడు. తనకు తెలిసిన స్నేహితుల మధ్యలో ఉంది రమణి. చూడగానే తన కళ్ళలో ఏదో మెరుపు ఉందని గమనించాడు. జీవితంలో ఎలాంటి అమ్మాయి భార్యగా కావాలనుకుంటున్నాడో తను ఇదివరకే రాసుకున్న కోరికల చిట్టాని చించేయాల్సిన సమయం వచ్చినందుకు సంతోషించాడు. అన్నింటినీ పక్కనపెట్టి రమణి సాన్నిహిత్యం శాశ్వతం బాగుణ్ణు అని గట్టిగా అనుకున్నాడు.

స్నేహితులలో లయకు అందరము కలిసిన క్షణాల్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏదైనా రుచి చూద్దాం అనిపించింది. చైతన్య తను ఆ పట్టణంలొ ఓ కళాశాలలో పని చేస్తున్నందున తనకు బాగా తెలుసునని ఒక కెఫెకి వెళ్ళారు. తను పార్టీ ఇద్దామనుకున్నా, కెఫెలో తినాడానికి ఏమీ లేవని బాధపడ్డాడు. దానికంటే మనసులో రమణి లాంటి ఆరాధనా విగ్రహం నింపుకున్నాడు, ఆమె అనుగ్రహం దక్కుతుందో లేదోనని ఒకటే కలవరం. ఆ ఊహల్లోంచి తేరుకొని బోయ్‌ని పిలిచి ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు.

చైతన్యకు బటర్‌స్కాచ్ ఫ్లేవర్ నచ్చేది ఇదివరకు. ఈ రోజు తనకది నచ్చలేదు. ఐస్‌క్రీమ్ కంటే రమణే నచ్చింది. కనక ఐస్‍క్రీమ్ నచ్చలేదని అందరితోనూ బాహటంగా చెప్పాడు. ఇదివరకు సినిమా ఇంటర్వెల్‍లో తినినపుడు నచ్చిందనీ, ఇప్పుడు నచ్చలేదని అంటే, “ఎవరో సుందరితో వెళ్ళుంటారు, అందుకే ఆ రుచి” అని కొంటెగా నవ్వి రమణి చురుక్కును విసిరింది.

తనతో పాటు అందరి మొహాలపై నవ్వులు విరిసాయి. ఇష్టమైన వాళ్ళ చిరునవ్వును శాశ్వతంగా దాచుకోవడం ఎలాగో తెలియక తికమకపడుతున్నాడు చైతన్య.

చైతన్య ఇదివరకు స్నేహాన్ని విరివిగా పంచినా, ప్రేమను పంచడంలో పొదుపరి. ఎందుకో తన ప్రేమ నిధినంతటనీ బ్లాంక్ చెక్ చేసి రమణికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. రమణి రూపం, హుందాతనం, చలాకీతనాలకి తను ఇచ్చేది తక్కువేనని తనకి బాగా తెలుసు. మదిలో నిండిన రమణికి తన ఆరాధన తెలపడానికి అడ్రస్ అవసరం కదా!! ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు చైతన్యకు.

లయ అందరి ఫోన్ నెంబర్లు తనకు కావాలనీ, ప్రతి వారానికి ఒకసారైనా కాన్ఫరెన్స్ కాల్‍‌లో మాట్లాడాలనీ చెప్పింది. అదే అదనుగా రమణి ఫోన్ నెంబరును తీసుకున్న చైతన్యకు చంద్రునిపై మొదటిసారిగా అడుగుపెట్టినంత ఆనందం కలిగింది. కెఫెలో ముచ్చట్లు తీరగానే అందరూ ఇంటి ముఖం పట్టారు.

***

చైతన్య తను పనిచేస్తున్న కళాశాలకు సెలవులు ఇవ్వగానే సొంత ఊరిలో వాలిపోయాడు. వంశధార నది ఒడ్డున తన ఊరుంది. ఎప్పుడు సెలవు దొరికినా ఆటవిడుపు అక్కడే! నగరంలో ప్లాస్టిక్ నవ్వులతో విసిగిపోయిన చైతన్యకు సొంత మనుషులని, ఊరిని చూడగానే నూతనోత్తేజం కలుగుతుంది. వెళ్ళిన రోజు పగలంతా పలకరింపులు, పరామర్శలతో గడిచిపోయింది.

సాయంత్రాలు నదీతీరాన గడపడం తన అలవాటు. ఆ సాయంత్రం తను నదీతీరాన నడుచుకుంటూ ఒంటరిగా వెళుతున్న చైతన్యకు – వెన్నెలను పిండి చేసి కుప్పలుగా మారిపోయాయేమో అనిపిస్తున్నాయి ఇసుకతిన్నెలు. వాటిపై ఒంటరిగా కూర్చున్నాడు. పోటెత్తిన వంశధారలా ఒక్కసారిగా రమణి ఊసులు తన హృదయాన్ని సజీవ నదిగా చేశాయి. ఒంటరితనం పోయి రమణి ప్రేమను ఎలా పొందాలనే ఆరాటం దిగులుగా మారింది.

దిగులు బాధగా మారింది. బాధను సౌఖ్యంగా భరించే శక్తి కృష్ణశాస్త్రిలా తనకు లేక వెంటనే ఫోను అందుకుని రమణికి ఫోన్ చేశాడు. నగరంలో ఒక సమావేశానికి వచ్చాననీ, మిత్రులందరూ గుర్తొచ్చారనీ అందుకే ఫోన్ చేశాననీ చెప్పాడు. “నా గొంతును గుర్తుపట్టారా”  అని అడిగాడు. “ఎందుకు గుర్తులేదు? చైతన్యగారేనా?” అని తిరిగి ప్రశ్నించింది. రమణి తన పేరును పలుకుతున్నప్పుడు గాని తన పేరు లేని అక్షరాలు అంత అందమైన శబ్దాన్ని ధ్వనిస్తాయని చైతన్యకు తెలియలేదు. వెంటనే, తను వచ్చిన సమావేశంలో అన్నీ బాగున్నా ఏదో కొరత ఉందని సమావేశం గురించి చెప్పాడు చైతన్య.

“ఏం కొరత?” ప్రశ్నించింది రమణి.

అందం కొరత వుందనీ, తమలాంటి ఆరాధ్యులు ఎవరూ లేరని నవ్వుతూ చెప్పాడు చైతన్య. ఆ నవ్వు వెనుక తనపై ఉన్న ఇష్టాన్ని రమణి గ్రహించింది.

“ఆ సమావేశంలో మీ పక్కనే పచ్చరంగు చీర అమ్మాయి ఫోన్ చేసింది, మీలాంటి అబ్బాయిని చూసినందుకు సంతోషంగా ఉన్నాననీ చెప్పింది” అంటూ రమణి ఆటపట్టించింది.

ఇలా మాటల ప్రవాహం మొదటి పరిచయంలో అరగంట సేపు… కాలం వాళ్ళకి తెలియకుండా జారిపోయింది. చైతన్యకు రమణి ప్రేమను గెలుచుకోగలననే నమ్మకం కుదిరింది.

***

పూల తోటలోని పుప్పొడిని తుమ్మెద వ్యాపింపజేసినట్టుగా, సాంకేతిక తోటలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వారి ప్రేమను పంచుకున్నారు. కష్టం, సుఖం ఏదొచ్చినా చైతన్యకు పంచుకోవాలనిపించేది రమణితోనే. ఈలోగా కళాశాలకు వేసవి సెలవలు ఎలా వచ్చిపోయాయో తెలియలేదు రమణి వల్ల.

ఏడాది గడిచింది. ఫోన్‌లో మెసేజిలు చిక్కనైనా, పలుచనైనా, మాటలు ఎక్కువైనా తక్కువైనా చైతన్య హృదయంలో రమణి స్థానం పదిలం, పవిత్రం మరియు శాశ్వతం.

ప్రేమకు పూలబాట వేసి పెళ్లికి రాచబాట వేసుకున్నాడు చైతన్య. తనలోని చైతన్యదీప్తిని రగిలించిన రమణే తన ప్రేమ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here