నా బైకు

5
3

[dropcap]నా[/dropcap] బైకు
మోటారు బైకు
రింగు రోడ్లను
హంగుల రోడ్లను
దాటింది.
గుంతల రోడ్లను
గతుకుల తోవలను
చూసింది.
ఎప్పట్లాగే
ఈ రోజు
నేను నా బైకుపై
మా వూరి గతుకుల
రోడ్దు దాటుతున్నాను.
ఎదురుగా యమస్పీడుగా
వచ్చేసింది
ఓ బైకు
కొత్త బైకు
టక్కున నేను
నా బైకును
గతుకుల రోడ్డులో పోనిచ్చి
కాస్త చదునైన రోడ్డులో
సాటి బైకు వెళ్ళేలా చేశా..
అంతే!
ఒక్కసారి
‘యాహూ’ అన్నాయ్
ఆ బైకుపై కూర్చున్న
గాడిద, కంచర గాడిద
మెచ్చుకోవడమో
తిట్టిపోవడమో
నాకర్థం కాలే..
పోనీలే.. అనుకొంటు
నా బైకుపై నేను
గతుకుల రోడ్డు
గుంతల్ని తెలివిగా
దాటి పోతున్నా.
అంతలో ఎదురుపడ్డడి
మరో బైకు
యథావిధిగా నా బైకును
గతుకుల రోడ్డు గుంతలపై
పోనిచ్చా..
‘మంచి పని చేశావ్’
నాపై హైకులు విసిరాయ్
ఆ బైకు పై కుర్చున్న
ముసలి గుర్రాలు.
నా మనసుకు తృప్తి కలిగింది
చల్లని గాలి
చంద్రోదయం కాని సాయంకాలం
చెరువు కట్ట తోవలో నేను.
గతుకుల తోవ గండాలను
అధిగమిస్తూ.. గమ్యం చేరు లోపు
చక చక మంటూ
చిన్నగా శబ్దం చేస్తూ
ఎదురైంది
ఓ బుల్లి బైకు
నేను నెమ్మదిగా
నా బైకును
గాతమైన గుంతలలోకి
మళ్లించే లోపు
అర క్షణంలో
ఆ పని
ఆ బుల్లి బైకుపై వచ్చిన
తెల్ల పావురం చేసింది
నేను తేరుకొనే లోపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here