Site icon Sanchika

నా కలం

[dropcap]ఏ[/dropcap]మని చెప్పను ఎలా చెప్పను
గుండెలోని మాట గొంతు నుండి రాదే
మనసులోని ఊసులు ఉయ్యాలై ఊగినా
నోటి నుండి మాట సూటిగా రాదే

నా గుండె చెప్పింది నా చేతికి
కనులు విన్న దృశ్యాలన్నీ
చెవులు చూసిన ధ్వనులన్నీ
చేతనైతే చేతితో చెప్పమని

కలమే నాకు సకలం ఇప్పుడు
కలలో కనిపించే కథలన్నీ
ఇలలో వినిపించే వ్యథలన్నీ
కలంతోనే కలకలమని చెప్పనీ

నా కలమే నాకు బలం
గుండెలోని మాట గొంతునుండి జారి
చేతిలోన దూరి, కలం సిరలలో
సిరాగా , కాగితం మీద జాలువారగా

నా ఊహలు, కలలు కథలు
వ్యథలు నా గుండె నిండా ఉన్న
చేదు నిజాలు తీపి అబద్దాలు
నా కలం చెబుతుంది,
నా కలం నా బలం

Exit mobile version