Site icon Sanchika

నా కళ్ళే అద్దాలు

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నా కళ్ళే అద్దాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]అం[/dropcap]దం నీది కాదు
చూసే నా కళ్ళది
సొగసు నీ సొంతం కాదు
వర్ణించే నా పెదవులది
కులుకులన్నీ నీవి కాదు
పిలిచే నా పలుకులవి
వయ్యారాల వంపులన్నీ
కొలిచి తరించే నా చూపులవి
నేనన్నది లేని నాడు
నీవన్నది లేనే లేవుగా
ఒంటి చేతితో రావు చప్పట్లు
జంటతోనే తీరేను ముచ్చట్లు

Exit mobile version