Site icon Sanchika

నా మనసు..!

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నా మనసు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప[/dropcap]గలంతా పనులతో
రాత్రంతా కలలతో
అలసిన నా మనసు
ప్రేమ పుస్తకమై
నీ ఎదను చేరుకుంది

నీ హృదయ స్పందనలు వింటూ
నీ చేతి స్పర్శకు పులకిస్తూ
నీ ఊహా లోకంలో విహరిస్తూ
పరవశించి, మురిసిపోతూ

నీ ప్రేమ తీరంలో పయనిస్తూ
నీ వెచ్చని శ్వాసను గమనిస్తూ
ప్రేమ స్మృతులను నెమరేస్తూ
ఆదమరచి, నిదుర పరచి
నీతో పాటు సేద తీరుతోంది

Exit mobile version