[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘నా రాధిక కోసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap] అడుగులతో
నామనసు అనురాగ మువ్వలగా
నీ చూపులతో
నా మనసు రెప్పల రవ్వల సవ్వడిగా
నీ నవ్వులతో
నా ఊపిరి చేసే నాట్యంలా
అల్లేసుకొని
అనునిత్యం ఎదురుచూస్తుంది.. నీ కోసం.. రాధిక
పలకరింపు లేని ఉషోదయంలా
నీ ప్రేమ మూగపోతే ఎలా
నేను నీకు ప్రత్యేకమో.. కాదో కానీ
ప్రేమ – ప్రణయం అనే బంధం
చెరపని.. లోకంలో
మనం అనుక్షణం
అనురాగమై.. పల్లవిస్తావా..
నా హృదయాన్ని ప్రేమతో
నీపై చిలకరిస్తా