Site icon Sanchika

నా వీధి బడి

ఒకే పంతులు
అన్ని చదువులు
పలక తప్ప
లేదు ఏ భారము

పెద్దబాలశిక్ష
పుస్తకము తప్ప
పిల్లలకు ఏ పుస్తకం
తెలియదు అప్ప…

ఆటలు పాటలు
సంచిలో చిరుతిండ్లు
పంతులు రాసింది
దిద్ది దిద్ది పెద్దదయ్యి..,.

పద్యాలు ఒక్కట్లు
ఎక్కాలు నెలలు
వారాలు నక్షత్రాలు
అక్షరాలు గుణింతాలు.,.,

పలికి పలికి
ఊగి ఊగి
అరచి అరచి
అలిసి పోయి…

కథలు చెప్పే ముందు
గుమిగూడి కూర్చొని
ఊ కొడుతూ ఊ కొడుతూ
కథలెన్నో విని….

చేలో పండిన
కాయలు కూరలు
ధాన్యాలు పంటలు
పంతులు ఇంట్లో పెట్టి….

నాగుల చవితికి
నువ్వులు కొబ్బెర్లు
గురుదక్షిణగా
పంతులుకు ఇచ్చి.,,.

ఈ బెత్తల కొసం
ఏటిగడ్డకు పోయి
ఈదులాడి వచ్చి
తన్నులు తిని.,,.

పంతులు చెప్పిన
పనులు ఏవైనా
పోటీలు పడి
ఊరికి ఊరికి చేసి..,

కొట్టుకుంటూ గిల్లుకుంటూ
స్నేహితులు ఆటపట్టిస్తూ
ఆనందాలు పంచుకుంటూ
సరదాగా గడుపుతు……

కోదండము గుంజిళ్ళు
తొడ పాశం బెత్తాలకు
బెదిరిపోకుండా
చక్కగా చదివినాము.

Exit mobile version