Site icon Sanchika

నా ఎంకి..

[గజల్ (ఖండగతి) రూపంలో ఈ కవితని అందిస్తున్నారు పారుపల్లి అజయ్‍ కుమార్.]

[dropcap]వి[/dropcap]రజాజి పువ్వులే రువ్వుతూ నా ఎంకి
నా వంక చూసింది నవ్వుతూ నా ఎంకి..

ఏడేడు జనుమలలో నీ తోడు నేనంది
గుసగుసగ చెవికొరికి చెప్పుతూ నా ఎంకి..

గుండె గదిలో నీవు కొలువై వున్నావంది
ఎనలేని ప్రేమలను తెలుపుతూ నా ఎంకి..

మోముపై కురులతో మబ్బులా కమ్మేసె
వయ్యారి నడకతో కులుకుతూ నా ఎంకి..

తన జాడ చెప్పకనె దూరంగ పోయింది
మదిలోన విరహాన్ని రేపుతూ నా ఎంకి..

 

Exit mobile version