సరికొత్త ధారావాహిక ‘నాదొక ఆకాశం’ – ప్రకటన

0
2

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘నాదొక ఆకాశం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా అందిస్తున్నాము.

***

పరిగెత్తే ప్రపంచాన్ని కూడా ఆపే శక్తి కేవలం సినిమా హీరోల,  తారల సొంతం. సినిమా వార్తలంటే ప్రపంచం చెవి కోసుకుంటుంది. రోజంతా ఈతి బాధలతో, సంసార సాగరంలో ఈదుతున్న సామాన్య మానవుడికి ఉల్లాసాన్ని కలిగించే అత్యంత చౌకైన, ఆరోగ్యకరమైన వినోద సాధనం – సినిమా.

టాలీవుడ్ – పైకి దేదీప్యమానంగా వెలుగు జిలుగులు చిమ్ముతున్నా, పై పై పొరల కింద అంతు లేని ఆవేదన ఉంటుంది. ఆ వెలుగుల, చీకట్ల దారుల గుండా మిమ్మల్ని ఒక రసరమ్య లోకం లోకి తీసుకు వెళ్ళే నవలే ‘నాదొక ఆకాశం‘.

సినిమా డైరెక్టర్, నవలా రచయిత, ‘నంది’ అవార్డు గ్రహీత, అసిస్టెంట్ కమీషనర్, {కమర్షియల్ టాక్సెస్} గా రిటైరయిన డా. ప్రభాకర్ జైనీ సినిమా రంగం మీద రాస్తున్న నాలుగవది అయిన, మొత్తం మీద 31 వ నవల అయిన ‘నాదొక ఆకాశం’ మీ కోసం.

సినిమా రంగం గురించిన అనేక అత్యంత ఆధునిక, సాంకేతిక ఆవిష్కరణలను పరిచయం చేసే ఈ నవలను తప్పక చదవండి.

***

ఆసక్తిగా చదివించే ఈ ధారావాహిక వచ్చే వారం నుంచి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here