నాడు – నేడు

0
2

[dropcap]ప్ర[/dropcap]చ్ఛన్న యుద్ధకాలంలో బర్మింగ్‌హమ్, లివర్ పూల్, గ్లాస్గో లపై దాడికి 4 పైగా టన్నుల అణ్వాయుధాలను, బ్రిటన్ గూఢచారి కేంద్రంపై దాడికి 2 పైగా టన్నుల అణు మిస్సైళ్లను, రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై మరి కొన్నిటిని రష్యా మోహరించి ఉంచింది. వాటన్నిటి శక్తి 398 మెగా టన్నులు.

అమెరికా సంగతి చెప్పేదేముంది. 7,256 క్షిపణులను ప్రయోగించడానికి సిద్ధంగా యుద్ధవిమానాలలో అమర్చి ఉంచింది. వాటితో చైనాను లక్ష్యంగా చేసుకున్నవే 1400 వరకు ఉంటాయి.

తానేం తీసిపోనంటూ చైనా ఏ క్షణంలోనైనా అమెరికాకు జవాబు చెప్పడానికి 14 అణుక్షిపణులను సిద్ధంగా ఉంచింది. అలా తక్షణ ప్రయోగానికి సిద్ధంగా ఉన్న క్షిపణులు రష్యా వద్ద 5000 పైగా, ఫ్రాన్స్ వద్ద 450 వరకు, చైనా వద్ద 400 వరకు, బ్రిటన్ వద్ద 250 పైగా ఉండేవి. అణుసామర్థ్యాన్ని కలిగి ఉన్న కారణంగానే అణ్వస్త్ర దేశాలు ఐదూ అప్పట్లో పరస్పరం కొంత నిగ్రహంతో వ్యవహరించడం జరిగింది. అణుసామర్ద్యం లేని యుగోస్లావియాకు నాటో దేశాలు ఏ గతి పట్టించాయో తెలిసిందే.

ప్రచ్ఛన్న యుద్ధంతో ప్లూటోనియం డిమాండ్ పెరిగింది. రమారమి 50 సవత్సరాల బాటు సంయుక్త రాష్ట్రాలన్నీ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా సర్వశక్తులూ కేంద్రకరించాయి. అదే ఆదర్శంగా కృషి చేసి బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు అణ్వస్త్ర దేశాలుగా అవతరించాయి. కథ అక్కడితో అగితే విశేషం లేదు.

ఈ పరుగు పందెంలో – అణు ప్రమాదాలు, వ్యర్థాలు, పరమాణు పరీక్షలు వంటి వాటి కారణంగా వెలువడిన అణుధార్మికత ప్రభావం – దుష్పరిణామాలు వంటి వన్నీ అనుభవంలోకి రావడం జరిగింది. వాటి వలన పర్యావరణానికి, జీవరాశులకు కలిగిన కలుగుతున్న హాని ఇంతా అంతా కాదు. అణువును ఆటవస్తువుగా చేసి ఆడుకున్న పాపానికి అమెరికా పరిష్కారానికి అందని అనేక సమస్యలతో సతమతమౌతోంది.

ప్రస్తుతం –

ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రస్తుతం కూడా అన్ని దేశాలతో కలిసి 13000 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అయితే అధ్యాధికంగా అణ్వాయధాలను కలిగి ఉన్నది మాత్రం అమెరికా, రష్యాలే.

రష్యా వద్ద 6,257 వరకు అణ్వయుధాలు ఉండగా U.S.A వద్ద 5,550 వరకు ఉన్నాయి. చైనా దగ్గర 350, ఫ్రాన్స్ 290, U.K 220, ఫ్రాన్స్ 165, భారదేశం 156 సంఖ్యలతో వరుసతో ఉన్నాయి. ఇజ్రాయిల్ దగ్గర కూడా 90 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి.

అయితే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ వ్యవస్థలతో జపాన్ మొదటి స్థానంలో ఉండటం విశేషం.

ఇప్పుడు అణ్యస్త్రాలు – బెదిరించడానికి తప్ప వినియోగించగల ధైర్యం ఏ దేశానికీ లేదు. న్యూక్లియర్ ప్లానింగ్ గ్రూప్‌కి ఫ్రాన్స్ దూరంగా ఉండిపోవడమే దీనికి ఉదాహరణ.

ప్రస్తుతం ఆర్థిక ప్రయోజనాలే దేశాలను శాసిస్తున్నాయి. ప్రాధాన్యాలు మారిపోయాయి. ఫలితంగా పర్యావరణ సంక్షోభం నలువైపుల నుండీ కమ్ముకుని వస్తోంది. కోట్ల ప్రాణాలు ఆ కారణంగానే గాలిలో కలసి పోతున్నాయి. మరిన్ని కోట్ల జీవితాలు ఛిద్రమైపోతున్నాయి.

నాటో దేశాల సంఖ్య పెరగడంతో ఆందోళన చెందవలసినదేమీ లేదు. ఆ పెంపు కొన్ని దేశాలకు వ్యతిరేకంగా కూడగట్టడానికో, పోరాటానికి సిద్ధం చేయడానికో కాకూడదు. పెరిగిన ఆ బలంతో ప్రస్తుతం ఉన్న సంక్షోభాలను తగ్గించే దిశగా, లేదా కనీసం నిరోధించగల దిశగా పోరాడటానికి సంకల్పించాలి. ఉదాత్తమైన లక్ష్యాలే అటవంటి కూటముల ప్రతిష్ఠను ఇనుమడింప చేస్తాయి.

చినుకే గాలివానగా మారడం వెనుక మర్మం?

సోవియట్ యూనియన్‌లో ఉన్నపుడు 1945లోనే U.N.లో సభ్యత్వంలోను వున్న ఉక్రెయిన్ సమితి వ్యవస్థాపక దేశాల్లో ఒకటి.

1992లో ‘నార్త్ అట్లాంటిక్ కో-ఆపరేషన్ కౌన్సిల్’లో చేరింది. తరువాతి కాలంలో అదే యూరో అట్లాంటిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ అయ్యింది.

అమెరికా ఉక్రెయిన్ పాలసీ విషయాని వస్తే U.S. 1991లోనే ఉక్రెయిన్‌ని సార్వభౌమదేశంగా గుర్తించింది. 1992లో కీవ్ లోని తన కాన్సులేట్‌ని ఎంబసీ స్టేటస్‌తో ఆధునికీకరించింది.

సద్దాం హయాంలో ఇరాక్‌కు ఉక్రెయిన్ నుండి అత్యంత ఆధునికమైన రక్షణ వ్యవస్థల బదలాయింపులు జరగాయన్న ఆరోపణలతో ఉక్రెయిన్‍ను దూరంగా ఉంచడం జరిగింది. 2014 -2018ల నడుమ అమెరికా ప్రతినిధుల సభ కొన్ని సవరణల ద్వారా – ఉక్రెయిన్ ప్రభుత్వానికి మద్దతును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసే వెసులుబాటును కల్పించింది కూడా.

అయితే నిఖార్సయిన నేతల ఆదర్శాలు, ఆశయాలు దేశం మార్కెట్ శక్తుల ఆశలు, ఆకాంక్షలు వేరు. పెంటగాన్/మార్కెట్ మాయాజాలం ముందు ప్రతినిధుల సభ ప్రయత్నాలన్నీ నీరుకారిపోయాయి. ఫలితం – 2014-2019ల నడుమ ఉక్రెయిన్‌కు అమెరికా నుండి అందిన మిలటరీ సహాయం 1.5 బిలియన్ యూ.యస్. డాలర్లు. కాగా 2021లో ఆ రక్షణ సహాయం 2.5 బిలియన్ డాలర్లని నివేదికలు చెప్తున్నాయి. పెంటగాన్‌లో ఆయుధ తయారీ సంస్థల లాబీయింగ్ అమెరికా పాలసీలను అంతగా ప్రభావితం చేయగలదు. ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఆయుధాలకు అవసరం పడుతూ ఉంటేనే వాటికి మార్కెటు ఉంటాయి.

యుద్ధం మొదలైన క్రొత్తల్లో జెలెన్స్కీ కొంచెం మెత్తబడి షరతులతో కూడిన రాజీకై చర్చిచడానికి సంసిద్ధం అయ్యారు. అంత తొందరగా సమస్య ముగిసిపోతే ఎలా? ఉక్రెయిన్ తమపై ఆధారపడాలి. రష్యాకు దూరం కావాలి. తద్వారా రష్యా బలహీనపడాలి. ఆఫ్ఘన్, ఇరాక్‌లలో వలె ఉక్రెయిన్‌లోనూ అనుకూలమైన ప్రభుత్వం కొనసాగాలి. అక్కడ వనరులను యథేచ్ఛగా వినియోగించుకోగలగాలి. యుద్ధ విరమణను కాంక్షింస్తున్నామంటూనే ఒక వంక ఆంక్షలతో, బెదిరింపులతో రష్యానూ రెచ్చగొడుతూ, మరొక వంక ఉక్రెయిన్ వెన్ను తట్టి ముద్దతుగా ఉంటామంటూ రక్షణ సహకారం కూడా అందిస్తుంటే ఇరుదేశాల నడుమ సంధి కుదేరేదెలా?  ఎవరి ప్రయోజనాలు వారివి.

అయితే కారణాలు ఏమైనాగానీ యుద్ధం మాత్రం అవాంఛనీయమే. యుద్ధం వలన జరిగే విధ్వంసం, మిగిలే విషాదమే కాక వారసత్వ సంపదకు, సంస్కృతీ సంప్రదాయాలకు జరిగిన తీవ్ర నష్టాన్ని ఇరాక్ విషయంలో మన చూసాం. ఉత్కృష్ఠమైన చారిత్రక సంపదలన్నీ తుడిచిపెట్టుకుపోయి ఒక రంగు వెలసిపోయిన బొమ్మలా మిగిలిపోయిన ఇరాక్ గత వైభవాలన్నీ, గుర్తుకు వస్తే బాధ కలగక మానదు.

అయితే ఇప్పుడు అమెరికా తానుగా యుద్ధం చేయదు. సైనిక స్థావరాలు, రక్షణ సహాయం వంటి చర్యలతో దేశాల నడుమ ఘర్షణను ప్రోత్సహిస్తుంది. రష్యా విషయానికి వస్తే ఆ దేశానికి ఎక్కడా సైనిక స్థావరాలు లేవు. ఏ దేశపు అంతర్గత వ్యవహారాలలోనూ జోక్యం చేసుకున్న దాఖలాలూ లేవు. కాకపోతే తనకు వ్యతిరేకంగా తన సహాచర దేశాలనే ఉసిగొల్పడాన్ని సహించకపోవడాన్ని తప్పు పట్టలేం. యుద్ధంలో ఎవరూ గెలిచేది ఉండదు. ఇరుపక్షాలకూ తీవ్రమైన జన ధన, నష్టాలే మిగులుతాయి అని పుతిన్ ఆది నుండీ అంటూనే ఉన్నారు. ఆ మాట అక్షర సత్యం.

ఉక్రెయిన్‌కు భారీ చమురు రవాణా వ్యవస్థ ఉంది. రవాణా రుసుము రీత్యా ఆ దేశం ఆదాయం రమారమి 7 బిలియన్ డాలర్లు –  ఆ దేశపు G.D.P 4 %. 2019లో ఉక్రెయిన్, రష్యాలు ఒక అవగాహనకు వచ్చాయి. రష్యా చమురు, సైబీరియా గేస్ యూరపియన్ యూనియన్‌కు పంపటానికి ఉక్రెయిన్ చమురు రవాణా వ్యవస్థను వినియోగించుకునేలా ఒక ఒప్పందం కుదిరింది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు అతీతంగా రష్యా, ఉక్రెయిన్‌ల నడుమ అంతటి కీలక ఒప్పందం కుదరడం అసలు విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here