Site icon Sanchika

నాలుగో రీలు

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘నాలుగో రీలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఎవరి ప్రమేయమూ ప్రోత్సాహమూ లేకుండానే
దినం పొద్దుగూకుతుంది
రాత్రి తెల్లారుతుంది
టేబుల్ మీది కాఫీ చల్లారుతుంది

కంటిచూపు మసకబారుతుంది
తల ముగ్గుబుట్టవుతుంది
నోరు బోసిపోతుంది
చలి లేకున్నా చేతులు వణుకుతాయి
రెండు కాళ్ళు మూడవుతాయి

వేగంగానో నెమ్మదిగానో ఎంత నడిచినా ఉరికినా
కాలం కాళ్ళు అరగవు తరగవు

మన కథే టైటిల్‌తో మొదలై
ఇంటర్వెల్ దాటి నాలుగో రీలు తోసుకొస్తుంది
రీలు మార్పులూ కరెంట్ కట్లూ తోడురాగా
శుభం కార్డుదాకా
తీరమీద బొమ్మ ఆడుతూనే వుంటుంది

ధైర్యమున్న మనసు
వెలుగులు చిందిస్తూనే వుంటుంది

ముసలితనం
ముసి ముసిగా నవ్వుతుంది

Exit mobile version