నాది అన్న స్వార్థం లేదు
నావాళ్ళు అనే భావం తప్ప
భార్యా పిల్లలు ఒక భుజాన
బాధ్యతలు ఇంకో భుజాన
తల మీద చింతల మూట
పెట్టుకొని పరిగెత్తే బాటసారి
సంసారమనే శరీరానికి
గుండెకాయ నాన్న….
ఎప్పడూ పని చేస్తూనే ఉండాలి
అలసటగా ఉంది…ఓసారి ఆగుతా
అంటే…..
అమ్మ దైవమన్నది సత్యము
మరి నాన్న….?
కఠినంగా కనిపించే కాంక్రీటు గుడి
నాన్న…