Site icon Sanchika

నాన్న లేని కొడుకు – కొత్త ధారావాహిక – ప్రకటన

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

“వికారాబాద్ ఎందుకు వెళ్ళారు?” అడిగాడు ఇన్‌స్పెక్టర్.

“జస్ట్ సరదాగా తిరగడానికి… అనంతగిరి హిల్స్, వాటర్ ఫాల్స్ చూసి, రెవెన్యు డిపార్ట్మెంట్‌లో పని ఉంటే చూసుకుని, రిసార్ట్స్‌లో నైట్ స్టే చేసి వస్తున్నాం”.

ఇన్‌స్పెక్టర్ సాలోచనగా తలాడిస్తూ “మీ ఫ్రెండ్ ఎక్కడ” అన్నాడు.

“వస్తాడు… కారులో ఆమె హ్యాండ్ బాగ్ ఉంది, తీసుకు వస్తున్నాడు.. వెంట మీ కానిస్టేబుల్ ఉన్నాడు” అన్నాడు గ్లాస్ డోర్‌లో నుంచి బయటకి చూస్తూ..

అప్పుడే మరో వ్యక్తీ, అతనితో పాటు కానిస్టేబుల్ వచ్చారు. అతను ఇన్‌స్పెక్టర్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ “నా పేరు శశాంక్ .. ఫిలిం డిస్ట్రిబ్యూటర్” అన్నాడు.

***

వచ్చే వారం నుంచే ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో…

Exit mobile version