నాన్నా! ఐ లవ్ యు

0
2

[dropcap]చి[/dropcap]న్న పాపాయిగా నాన్న గుండెల మీద వేసుకొని హాయిగా నిద్రపుచ్చేవారని అమ్మ చెప్పేది
తప్పటడుగులు వేస్తూ నడుస్తున్న
నన్ను, నాలుగడుగులు వేయకుండానే అలసిపోతానని
ఎత్తుకున్న ఆ అపురూపమయిన ప్రేమ గురించి చెప్పింది.
బాల్యంలో మొదటి రోజు బడికి వెళ్లనని మారం చేసినప్పుడు చిన్న మొక్క పెద్దదయి అందరికి నీడ నిస్తుంది.
నువ్వు బాగా చదువుకుని తోటి వాళ్ళకి సాయపడాలి నీడనిచ్చే వటవృక్షంలా, అన్న మీ మాట ఇప్పటికి శిరోధార్యమే!
నాన్నతో పాటు ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు ఒక ధైర్యం
నాన్నుంటే దేన్నైనా ఎదుర్కొనేందుకు ఒక ధీమా వచ్చేది, ఓ నమ్మకం
నాన్న చిటికెనె వేలుపట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అదో విధమైన గర్వం నాలో
మొదటి సారి హైస్కూల్ నుంచి కాలేజీకి అడుగు పెట్టినప్పుడు ఓ స్నేహితుడిలా ఎన్నో విషయాలు చెప్పారు.
నాన్న ఇచ్చే బలం కొండంత అదే నాలో మన స్థైర్యం ఆత్మ విశ్వాసాన్ని కొండంతలుగా పెంచాయి
నాన్నంటే, ప్రేమకు మారు పేరు అయినా నా కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో నాన్నా మీరు పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి.
నా తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేసారు నాన్న
అంతులేని వాత్సల్యానికి ప్రతిరూపం. నాలో ధైర్యాన్ని నింపి, ఈ ప్రపంచం లో బతికేందుకు అనుక్షణం ఆసరా ఇచ్చేది నాన్న
నా కోసం ఎన్నో త్యాగాలు చేసి మమ్మలిని ప్రేమిస్తూ, జీవించడం నేర్చుకున్న వ్యక్తిగా నాన్న పరిపూర్ణ మూర్తిమత్వం ఇప్పుడు బాగా అర్దమవుతోంది..
నాన్న మొదటి సారి తాత అయినప్పుడు ఆ కళ్ళలో దాచుకోలేని సంతోషం ,ఆనందం,
నేను ఎన్నడూ చూడని మరో కోణం నాన్నలో,
చిన్నపిల్లాడిలా మురిసిపోతూ మనవలు చేసే ప్రతి పని అబ్బురంగా చూస్తూ ఉండే ఆయనలో గంభీరం పోయి చిలిపితనం కనిపించేది.
నాన్న మరణం జీర్ణించుకోలేకపోయినా,అది నిజం భరించాలని
ఈ లోకంలో లేని నాన్న ప్రేమలోని గాఢత లోతెంతో తెలిశాక నా గుండె బరువెక్కిపోతుంది.
అప్రయత్నంగా మనసు నాన్న తాలూకూ జ్ఞాపకాలవైపు మళ్ళుతుంది.
నాన్నా! ఐ లవ్ యు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here