[dropcap]నే[/dropcap]డు
నటన ఒక అవసరం
లౌక్యం ఒక అందం
స్వార్ధం ఒక కళ
వంచన ఒక వల
నాడు
మాట ఒక ధర్మం
నిజం ఒక న్యాయం
నిజాయతీ ఒక గౌరవం
మనిషి ఒక వరం
నేడు
చదువు ఒక సుఖం
డబ్బు ఒక లక్ష్యం
మనిషి ఒక వస్తువు
మనసు ఒక బొమ్మ
నాడు
విద్య ఒక విలువ
సొమ్ము ఒక కష్టం
మనిషి ఒక బంధం
మనసు ఒక ప్రాణం