నదులు

0
2

[box type=’note’ fontsize=’16’] మార్చి 14న ‘నదుల పరిరక్షణ చర్యలకోసం అంతర్జాతీయ దినోత్సవం‘ జరుపుకొంటున్న సందర్భంగా బాలల కోసం నదుల పరిరక్షణ అవసరాన్ని తెలిపే కథ అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]న[/dropcap]రేన్ ఫామిలీతో బాసరకి పిన్ని కూతురు అక్షరాభ్యాసానికి వెళ్ళాడు.

ఫంక్షన్ అయిన తరువాత అమ్మమ్మ, అమ్మ, పిన్ని, అత్తా అందరూ కలిసి గోదావరి నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడ గలగలా పారుతున్న నీటిని చూసి అందరూ ఆనందపడ్డారు.

అమ్మా వాళ్ళు తీసుకువచ్చిన పూలు, పసుపు కుంకుమ, దీపాన్ని నది నీటిలోకి వదిలి – ప్రజలకు తాగు నీరు, సాగు నీరు అదే నండి డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్/క్రాప్స్‌కి వాటర్ లోటులేకుండా ఇవ్వమని కోరుకున్నారు.

నది నీటిలో తేలుతూ వెళుతున్న దీపపు ఆకు దొన్నెలను చూస్తూ ఆశ్చర్యం ఆనందంతో అమ్మమ్మ దగ్గరకు పరుగున వెళ్లిన నరేన్ “అమ్మమ్మా! అమ్మమ్మా! మీరందరు నదిలోకి పూలు, దీపం ఎందుకు వదిలి పూజచేశారు?” అని అడిగాడు.

“నరేన్! మేము అందరం గోదారమ్మని ఏమి అదిగామో వినలేదా?”

“విన్నాను అమ్మమ్మా! బట్ స్టిల్ వై? నదులను పూజించాలా?”

నరేన్ ప్రశ్నకి నవ్వి అమ్మమ్మ అందర్నీ నది ఒడ్డున ఉన్న పెద్ద చెట్టు క్రిందకు పిలిచి కూర్చున్నాక పిల్లలు అందరిని దగ్గరకు తీసుకుని కొబ్బరి ముక్కలు, అరటి పండు ఇచ్చింది.

“నరేన్ ! భూమి మీద ఉన్న అన్ని ప్రాణులకి, అడవులు, బర్డ్స్, ట్రీస్, అల్ లివింగ్ బీయింగ్స్… అన్నిటికి బ్రతకటానికి నీరు అవసరం” అన్నారు అమ్మమ్మ.

“అవును. మా టీచర్ చెప్పారు.”

“నదులు చెరువులు అంటే lakes లాగా ఒక్క చోటే స్థిరంగా ఉండవు.  నదులు ఎక్కడో పుట్టి, ఇంకెక్కడికో ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్లు. భూమి ఉపరితలం మీద ప్రవహిస్తూ తనను తానూ శుభ్రం చేసుకుంటూ అందరికి అవసరమైన మంచి నీటిని, clean water ని ఇస్తూ ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలవటానికి ముందు స్లో అవుతూ తానూ తెచ్చిన క్లీన్, fertile soilని మనకి పంటలకు వదిలి వెళ్ళిపోతుంది. ఆ soil ని delta lands అంటారు.

నది పుట్టుక నుండి చివరి దాగా ప్రాణుల కోసం ముఖ్యంగా మనకోసం selfless గా నిస్వార్ధంగా ప్రవహించి అన్నీ మనకే వదిలి వెళ్తుంది. నదులకి దగ్గర్లోనే ఫస్ట్ సివిలైజేషన్స్ ఉండేవి.”

“అవును అమ్మమ్మ. గుర్తుకు వచ్చింది మా సోషల్ టీచర్ చెప్పింది. హరప్పా, మొహంజదారో, ఇండస్, Mesopotamian, ఈజిప్టు లాంటి నాగరికతల గురించి” అన్నాడు నరేన్ ఉత్సహంగా.

“మరి అలాంటి నదులని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మనం చాలా స్వార్ధపరులం. అందుకే ప్రపంచవ్యాప్తంగా నదులని కలుషితం చేస్తున్నాము. అడవులు నరికి, కొండలు తవ్వి పర్యావరణాన్ని పాడు చెయ్యటంతో వానలు సరిగ్గా కురవక నదులు ఎండిపోతున్నాయి. నదులను కాపాడుకోవాలి, సముద్రంలో కలిసే నీటిని ఆనకట్టలతో ఆపగలగాలి, నీటిని పరిమితంగా, waste చెయ్యకుండా వాడాలి. నదులు చెరువులలో ఫుల్ గా నీళ్లు ఉంటే చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ground water levels పెరుగుతాయి. water ని pollute చెయ్యకూడదు. అలా చెయ్యటంతో మనం పండించే పంటల నుండి మన ఆహరంలోకి కాలుష్యం చేరి మనకి అనేక రోగాలు… diseases వస్తాయి. నదులు వాటి తీరం అంటే river and its coast line చెట్లతో, ఫిష్, పక్షులు, water falls తో ఎంతో beautiful గా ఉంటుంది. ఆ బ్యూటీని సేవ్ చెయ్యాలి. అందుకే ప్రతీ సంవత్సరం march 14th న international day of action for rivers గా ప్రకటించారు. ప్రభుత్వాలు, NGO లతో కలిసి ప్రజలం మనం save rivers అని కాపాడాలి” అన్నారు అమ్మమ్మ.

“అమ్మమ్మా! మాకు నది గురించిన కధ చెబుతావనుకున్నాము” అన్నారు పిల్లలు నిరాశగా.

“ఓహ్ ! మర్చిపోయాను. సరే వినండి” అన్నారు అమ్మమ్మ.

ఇంతలో పిన్ని “అమ్మా! నన్ను చెప్పనీ ప్లీజ్” అంది. పిల్లలు పిన్ని చుట్టూ చేరారు వినటానికి.

“నరేన్ మనం అందరం హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి హాలిడేకి వెళ్ళాము, గుర్తుందా?”

“ఉంది పిన్ని” అన్నారు పిల్లలు.

“అక్కడ నది ఎలా ఉంది?”

“సో బిగ్. beautiful. మనం రివర్ రాఫ్టింగ్, బోటింగ్, ఫిషింగ్ చేసాము” అన్నారు పిల్లలు.

“ఆ రివర్ పేరు బియాస్. ఐ విల్ టెల్ అబౌట్ దట్ స్టోరీ. రెడీ. వినండి. హిమాలయ పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి 14308 అడుగుల ఎత్తులో రోహతాంగ్ పాస్‌లో ఆవిర్భవించి/పుట్టి కుల్లు లోయ నుండి తన ఉపనదులతో కలసి ప్రవహిస్తూ ‘మండి’ నుండి కాంగ్రా లోయ, అక్కడనుండి పంజాబ్ లోకి ప్రవేశిస్తుంది. సట్లెజ్ నదితో కలసి ప్రవహించి సింధు నదికి ఉపనదిగా పశ్చిమాన పాకిస్తాన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది.

అలెగ్జాండర్ చక్రవర్తి భారతావని/ఇండియా పై క్రీ.శ 360లో దండయాత్ర సాగిస్తున్నప్పుడు ఆ వీరుడిని ఆవలికి పోనివ్వక ఆపిన నది బియాస్. 8 ఏళ్ల నిరంతర యుద్ధాలతో విసిగి అలసి కుటుంబానికి దూరంగా ఉండి నీరసపడిన సైనికులు ఎంతమాత్రం యుద్ధానికి ఇష్టపడక వెనుదిరిగి దేశానికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. వారికి బియాస్ నది ఒడ్డుపై మూడురోజులపాటు ఎంతగా నచ్చచెప్పాలని చూసినా వీలుకాక దేశానికీ తిరిగి వెళ్తూ మార్గమధ్యలో అలెగ్జాండర్ మరణించాడని చారిత్రక కధనం. బియాస్ నదికి పురాతన పేరు విపిష అనగా హద్దులు లేనిది. ‘అర్జికుజ’గా వేదాలలో, ‘హైఫసిస్’గా పురాతన గ్రీకులో చెప్పబడినది. అంతేకాదు వ్యాస మహర్షి నిర్మిత వ్యాసకుండం అనే చోటనుండి ఆరంభం అవుతున్నందున దానికి ‘వ్యాస’ అనే పేరు వచ్చి కాలక్రమేణా ‘బియాస్’గా మారిందిట. మహాభారతంలోని సభాపర్వంలో విపాశ లేదా వ్యాస నది గురించిన ప్రస్తావన వుంది.

ఇంకొక పురాణ గాథ ప్రకారం సప్తఋషులలో ఒకడైన వశిష్ఠుడిని కల్మషపాదుడనే రాజు రాజగురువుగా నియమించి గౌరవించాడు. కానీ ఆ పదవిని కోరుకుంటున్న మరొక గొప్ప జ్ఞాని విశ్వామిత్రుడు అసూయతో రగిలిపోతూ తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. వసిష్ఠ ఋషికి 100మంది కుమారులు. ఒకనాడు అతని పెద్ద కుమారుడు నడుస్తున్న రహదారిలో రాజు కల్మషపాదుడు ఎదురువచ్చి దారి ఇమ్మని అడిగితే వసిష్ఠుని కుమారుడు “రాజా! రహదారిపై నాకే మొదటి హక్కు” అని దారివ్వలేదు. అందుకు కోపించిన రాజు వసిష్ఠ కుమారుని కొరడా దెబ్బలతో దండించగా కోపంతో అతడు “నీవు మానుషమాంసం తిందువుగాక” అని శపించాడు.

అదృశ్యరూపంలో అక్కడే ఉన్న విశ్వామిత్రుడు తనకి తగిన అవకాశం దొరికిందని భావించి తన ఆధీనంలో ఉన్న ఒక రక్కసికి రాజు శరీరంలోకి ప్రవేశించి వసిష్ఠుని 100 కుమారులను తినమని చెప్పాడు. తన కుమారుల దుర్మరణం గురించి తెలుసుకున్న వసిష్ఠుడు వివేకాన్ని, జ్ఞానాన్ని మరచి దుఃఖంతో తానూ మరణించాలని ప్రయత్నించాడు. మేరు మహాపర్వతం శిఖరం నుండి దూకితే మేరువు తన శిలలను దూదిలా మెత్తగాచేసి బ్రతికించింది.

ఇదికాదని మండుతున్న అడవిలో దూకితే అగ్ని చల్లారిపోయింది. మెడకు బండరాళ్లను కట్టుకుని సముద్రంలో దూకితే దూదిలా పైకి తేలాడు. మహోగ్రంగా ప్రవహిస్తున్న నదిలో దూకితే ఆ నది 100 పాయలుగా చీలి ఋషిని బ్రతికించి శతదృ నదిగా పురాణాల్లో పిలువబడి నేడు సట్లెజ్ నదిగా పిలవబుతున్నది. చివరి ప్రయతంగా తనను తానూ బంధించుకుని హిమాలయ పర్వతశిఖరం నుండి ప్రవహిస్తున్ననది వరద ప్రవాహంలోకి దూకాడు. ఆ నది ఋషిని బంధవిముక్తుని చేసి ఒడ్డుకు చేర్చింది. ఆనాటి నుంచి ఆ నదిని విపశ అంటే బంధాలు లేనిది, వ్యాసగా పిలువబడి నేడు బియాస్‌గా పిలుస్తున్నాం.

కధలు ఏమైనా బియాస్ నదీప్రవాహ ప్రాంతం సారవంతం. వ్యవసాయం, పర్యాటకంతో ప్రకృతి ఒడిలో విలసిల్లుతుంది. అంతేకాదు అనేక ప్రాచీన సంస్కృతులకు,సంఘటనలకు సాక్షి భూతం. దేవతలకు నెలవైన కొలువైన పవిత్రస్థలంగా స్థానికులు పరిగణిస్తారు.

ఇది బియాస్ నది స్టోరీ. ప్రతి నదికి ఎలాంటి లోకల్ స్టోరీ ఉండే ఉంటుంది. అందరి మంచి కోరుకునే వారు నదికి హారతి, 12 ఏళ్ళకి ఒకసారి పుష్కర పూజలు చేస్తారు. వాటి ముఖ్య ఉద్దేశం నది ఇంపార్టెన్స్‌ని తెలుసుకోవటం, కాపాడటం. But unfortunate, అమ్మమ్మ చెప్పినట్లు water bodies pollute అవుతున్నాయి” అన్నారు పిన్ని.

పిల్లలు ఆలోచనలో పడ్డారు. నదులని ఎలా కాపాడాలా అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here