[dropcap]1[/dropcap]980వ దశకంలో యువ మాసపత్రికలో “నాకు నచ్చిన నా కథ” అనే శీర్షిక క్రింద ప్రతినెలా ఒకో రచయిత తనకు నచ్చిన తన కథను ప్రకటించేవాడు. ప్రస్తుత కథా సంకలనానికి ఇది ప్రేరణ అవునో కాదో తెలియదు కానీ ఈ సంకలనంలో 54 విభిన్న రచయితలు మెచ్చిన 54 కథలు ఉన్నాయి. ఈ కథాసంకలనానికి శ్రీ ఎన్.కె.బాబు సంపాదకులుగా వ్యవహరించారు.
దీనిలో మల్లాది వెంకటకృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, దాట్ల దేవదానంరాజు, జడా సుబ్బారావు, ఎం.వి.జె.భువనేశ్వరరావు, బొమ్మదేవర నాగకుమారి, కేతు బుచ్చిరెడ్డి, పి.చంద్రశేఖర ఆజాద్, సలీం, సింహప్రసాద్, వడలి రాధాకృష్ణ, స్వరలాసిక మొదలైన కథకుల కథలు చోటు చేసుకున్నాయి. బాల సాహిత్యానికి చెందిన 5 కథలకు ఈ సంకలనంలో స్థానం కల్పించడం అభినందనీయం. ఈ ప్రయోగం హర్షించదగినది. ముందుముందు ఇటువంటి కథాసంకలనాలను మరిన్ని వెలువరించేందుకు ఎన్.కె.బాబుగారికి ఈ పుస్తకం గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని నిస్సందేహంగా భావించవచ్చు.
***
సంపాదకులు: ఎన్.కె.బాబు
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
ప్రతులకు: 9440343479, 0866-2436642
వెల:₹200