నల్లటి మంచు – దృశ్యం 12

0
2

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-12

[dropcap](రా[/dropcap]జ్ బజార్లో నడిచిపోతున్నాడు. అనుకోకుండా డా. నసీరుద్దీన్ డార్ కూడా అదే బజార్లోంచి వెళ్తూ కనిపిస్తారు. రాజ్‌ని చూసి నిర్ఘాంతపోయి, కేక వేస్తారు)

డా. నసీర్ : (సంతోషంగా) రాజ్! ఓ రాజ్… అబ్బా! నువ్వు ఇక్కడ?

రాజ్ : (గద్గదస్వరంతో) డాక్టరు సాబ్!

(ఇద్దరూ ఆలింగనం చేసుకుంటారు).

డా. నసీర్ : (గద్గద స్వరంతో) ఎక్కడికెళ్లిపోయావు చెప్పు?… స్నేహితుల మీద అలా కోపగించుకుంటారా?

రాజ్ : అవేం మాటలు డాక్టరు సాబ్… నేను…

డా. నసీర్ : సర్లే గాని, ఎలా ఉన్నావో చెప్పు? ఏం చేస్తున్నావు? రూప ఎలా ఉంది?

రాజ్ : అంతా బాగానే ఉంది… అన్నీ బాగుపడతాయిలెండి… ఇదే జీవితం అంటే… దానిష్టం. ఎలా కావాలంటే అలా నడిపిస్తుంది.

డా. నసీర్ : చాలా – చాలా వెతికేను తెలుసా నీకోసం? చాలామందిని వాకబు చేస్తూనే ఉన్నాను… కాని నువ్వు చూడు ఎంత హఠాత్తుగా కలిశావో! నిజం… ఇదే జీవితం అంటే…

రాజ్ : మీరేంటి ఇలా ఇక్కడ దిల్లీలో? ఇంట్లో అందరూ… ఒదినగారు…

డా. నసీర్ : (దీర్ఘంగా నిట్టూర్చి) అంతా బాగానే ఉంది… ఇక ఇంటికే వెళ్తాను… రెండేళ్ల తరవాత!

రాజ్ : రెండేళ్ల తరవాతా? అంటే అర్థం?

డా. నసీర్ : అదీ ఒక విచిత్రమయిన గాథలే! (ఇటు – అటూ పరికించి) పద; అలా అక్కడికి వెళ్లి కూర్చుందామా?

రాజ్ : తప్పకుండా… పదండి!

(డా. నసీర్ చీనార్ చెట్టు మొదలు పైన కూర్చుని)

డా. నసీర్ : ఇలాటప్పుడు ఒక టీ తాగితే? (అటు పైన గట్టిగా కేకవేసి) రెండు కప్పుల టీ తెచ్చిపెట్టు… (ఏదో పోగొట్టుకున్న ధోరణిలో) మీరయితే శ్రీనగర్ నుండి ముందే వచ్చేసేరు… పరిస్థితులు చూస్తే రోజు-రోజుకూ పాడయి పోతున్నాయి. (గొంతుకలో ఆత్మీయత ధ్వనిస్తూండగా) నీకు గుర్తుందా మన గుల్లా ఉండేవాడు… అదే, చిన్నప్పటినుండి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను… ఇంటిపన్లు చేసేవాడు…

రాజ్ : (ఆత్మీయంగానే) అవునవును… మన గుల్లా… (అప్పుడే ఒక కుఱ్ఱాడు రెండు కప్పుల టీ తెస్తే, ఇద్దరూ తాగుతూంటారు)

డా. నసీర్ : ఒకరోజు హఠాత్తుగా ఇంటినుండి మాయమయినవాడు, తిరిగి రానేలేదు… ఎన్నో నెలలు గడిచిపోయాయి… ఒకరోజు మంచు బాగా కురుస్తున్న రాత్రివేళ…

(డా. నసీర్ టీ కప్పు పక్కన పెడతారు. లేచి రంగస్థలంపైన ఎదురుగా వస్తారు. రాజ్ ఆయన వంక తన టీ తాగుతూ – తాగుతూ చూస్తాడు. డా. నసీర్ జరిగిన సంఘటనలు, ఎదురయిన ఇబ్బందులూ చెపూండగా, flash back మొదలు).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here