Site icon Sanchika

నాలోని నువ్వు

[dropcap]నా[/dropcap]లోని నువ్వు మేఘంలా కదులుతావు
నన్ను నాకు చిరుగాలిలా చూపుతూ…

నాలోని నువ్వు మెరుపులా మెరుస్తావు
నాకు నన్నే కొత్తగా చూపుతూ…

నాలోని నువ్వు సెలయేరై నవ్వుతావు
నన్ను నాకు చినుకులా పరిచయిస్తూ…

నాలోని నువ్వు అక్షరమై మొలుస్తావు
నాకు నన్నే కావ్యంలా చూపుతూ…

నాలోని నువ్వు కలగా జారుతుంటావు
నాకు నన్నే రేయిగా చూపుతూ…

ఎందుకో…
ఒక్కోసారి నాలోని నువ్వు కన్నీరుగా మిగులుతావు
నాకు నన్నే ఓదార్పుగా మలుస్తూ…

ఇంకోసారి
నాలోని నువ్వు అందనంత ఎత్తులో
నింగిలా మారుతావు
నన్ను నాకే సంద్రంలా మిగులుస్తూ…!!

Exit mobile version