[dropcap]ఎ[/dropcap]నుగంటి వేణుగోపాల్ రచించిన కథా సంపుటి ‘నాలుగు మెతుకులు’.
“ఎనుగంటి వేణుగోపాల్ కథల సంపుటి నాలుగు మెతుకులు నాలుగు భిన్నరకాల కథల మేళవింపు. కొన్ని లిటరల్ థింకింగ్‌కీ, కొన్ని భావుకత్వానికీ సంబంధించినవి. మూడో విభాగం సామాజిక స్పృహతో కూడినవి. చివరగా కొన్ని అతి సాధారణమైనవి” అని ‘నాలుగు మాటలు’ అనే ముందుమాటలో యండమూరి వీరేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు.
మనిషిలో మానసిక పరిమాణాన్ని, ఎదుగుదలనీ చాలా హృద్యంగా సృష్టించడంలో రచయిత కృతక్రుత్యులయ్యారని ఆయన ప్రశంసించారు.
మొత్తం 17 కథలున్నాయి ఈ సంపుటిలో.
ఒక ఆలోచన, దోమ@మనిషిడాట్‌కామ్, ముష్టి, రేఖాచిత్రం, వానపాము, పల్లెబ్రతుకులు, మైల, చీపురు వంటి కథలున్నాయి.
ఈ కథలన్నీ పాఠకుడిని ఆకట్టుకుంటాయనటలో సందేహం లేదు.
***
రచన: ఎనుగంటి వేణుగోపాల్
పేజీలు: 160: వెల: ₹ 150/-
ప్రతులకు:
ఎ. అంజలి, 1-3-168/1,
కృష్ణనగర్, జగిత్యాల
తెలంగాణ 505327
ఫోన్: 9440236055