[dropcap]న[/dropcap]లుపు నలుపు అని పలుమార్లు మాటలతో నసగనేలా???
పదహారు వేల గోపికలు కలిగిన ఆబాల గోపాలుడు , దేవకీ నందనుడు అయినాడే నల్లనయ్య కాని కాదే తెల్లనయ్య
నలుపు వర్ణం లేక పోల్చుటకు రాదు శ్వేత వర్ణమైనా , పసిడి అందమైనా
సూరీడు తన కంతులను నెట్టేసిన గాని రాదులే ఆ నల్లని రేయి
భూమి తిరుగక, నలుపు వర్ణంతో కూడిన రేయి రాక గడవనిదే రోజు
మనుజుడు నల్లనుండ నీకేల చింత???
వర్ణమున ఏమున్నది అతి అమూల్యమైనది
వర్ణించుటకు వారి గుణగణములు తప్ప
చెప్పనేరగ తగిన కార్యముల్ తప్ప
పడతి అయినా , పురుషుడైనా ఒకే జాతి బిడ్డలే కదా
మానవ జాతి, మానవాళి జగతి
సాగుతున్న కాలంతో పాటుగా
గడుస్తున్న తరాలు
వైజ్ఞానికంగా వచ్చెను కొత్త పరికరాలు
తెచ్చెను కొత్త పోకడలు
అన్ని దిక్కులనుండీ , అన్ని కోణాల నుండి
మొత్తంగా సమాజం లో వచ్చిన మార్పులేలా???
కుల, మత, జాతి వివక్షతలతో నెయ్యము చేసి వచ్చెనో
లేక మునుపు నుండే మసలుచున్నదో వర్ణ వివక్షత
ప్రకటనలతో వర్ణన పై లేని ప్రాముఖ్యత ను పెంచి
మారని రంగుకు రంగులద్దుకొమ్మని చెప్పి
లేని ఆశలు కలిపించి , మార్పు రాక నిరాశను కలిగించక
ప్రతిభను ప్రశంసిస్తూ విశ్వాసాన్ని పెంచు
వర్ణము పై ప్రతికూల వ్యాఖ్యలు చేసి నిరాశ, నిస్పృహలకు తావు ఇవ్వకు